మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిన్న సినిమా టైటిల్‌ను ప్రకటించి, సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు `అల వైకుంఠపురములో..` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పోతన భాగవతంలోని ఒక పద్యంలో వచ్చే మొదటి లైన్ లో అల వైకుంఠపురములో అని వస్తుంది.
అలాగే ఈ సినిమాలో ఈ సినిమాలో టబూ ఇల్లు వైకుంఠపురము అనే పేరుతో ఉంటుంది. సినిమా కథ అంతా ఆ ఇంటి చుట్టూనే తిరుగుతుంది. దీనితో సినిమాకు అల వైకుంఠపురములో అనే టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. చాలా కాలం తరువాత టబూ ఈ సినిమాతో తిరిగి తెలుగులో నటిస్తుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తన గత చిత్రం నా పేరు సూర్య పెద్ద ప్లాప్ కావడంతో బన్నీ షాక్ తిన్నాడు. ఆ తరువాత తన తరువాతి సినిమా మొదలు పెట్టడానికి ఏడాది వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. దానితో అల వైకుంఠపురములో.. సినిమాతో పెద్ద హిట్ కొట్టడానికి బన్నీ కృతనిశ్చయంతో ఉన్నాడు.



