‘బాహుబలి’ గుర్రాలా… మజాకా..!

Subbaraju opens on baahubali secretsదర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “బాహుబలి – ది కన్ క్లూజన్” సినిమాలో నటుడు సుబ్బరాజు ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమాలో కనపడని సుబ్బరాజు, అమరేంద్ర బాహుబలితో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తను పాల్గొన్న సన్నివేశాలలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సుబ్బరాజు.

ADVERTISEMENT

మనకు ‘యాక్షన్’ చెప్తే షాట్ రెడీ చేసుకున్నట్లు… గుర్రాలకు ‘రెడీ’ అని చెప్పగానే అవి సిద్ధమవుతాయని… ఆ విధంగా శిక్షణ ఇచ్చారని, అయితే సినీ పరిభాషలో షాట్ తీసే ముందు ‘రెడీనా’ అని అడగడం సర్వసాధారణం అని, కానీ అలా రాకుండా జాగ్రత్త పడ్డప్పటికీ, ఓ సారి ‘రెడీనా’ అని చెప్పడంతో, రధంతో ఉన్న గుర్రాలు పరిగెత్తాయని, తానూ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయానని, ఆ రధం చక్రం తన రివర్స్ లో తిరుగుతూ కనపడిందని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో నటించడం తనకు చాలా గొప్ప అనుభూతిని కలిగించిందని, ఎప్పుడో ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ వంటి వారు కిరీటాలు పెట్టుకుని ఉంటే చూసిన అనుభూతి ఇప్పుడు తనకు కలుగుతోందని, ప్రతి విషయంలోనూ రాజమౌళి చూపించే శ్రద్ధ… అందరికీ వచ్చేది కాదని, ఒక విజన్ ఉన్న దర్శకులకే సాధ్యమని, ప్రభాస్ తో కలిసి ఉన్న సన్నివేశాలలోనే ఎక్కువగా పాల్గొన్నానని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఓ కబురందించాడు.

ADVERTISEMENT
Latest Stories