‘శ్రీమంతుడు’ సినిమాలో ‘కట్’ చేసారు!

Subbaraju Scenes deleted in Srimanthudu Movieహీరో ఫిజిక్ ఉండి క్యారెక్టర్ ఆరిస్ట్ పాత్రలు చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు, ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీబిజీగా ఉండే నటులలో ఒకరు. ఎలాంటి పాత్రలనైనా అద్భుతంగా పోషించగల సుబ్బరాజు, టాలీవుడ్ టాప్ 2 స్థానంలో ఉన్న “శ్రీమంతుడు” సినిమాలో చిన్న పాత్రను ఎందుకు పోషించారా? అన్న టాక్ అప్పట్లో హల్చల్ చేసింది. మహేష్ కు బాబాయ్ గా, ఒక ఆధ్యాత్మికత గల పాత్రలో ఫస్టాఫ్ లో ఒక నాలుగైదు సన్నివేశాలలో, సెకండాఫ్ లో ఓ రెండు, మూడు సీన్లలో మాత్రమే కనపడతారు.

ADVERTISEMENT

దీనిపై వివరణ ఇచ్చిన సుబ్బరాజు, నిజానికి తన పాత్ర చాలా బాగుటుందని, అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో తన పాత్ర పరిధిని బాగా తగ్గించడంలో భాగంగా క్యారెక్టర్ చిన్నది అయ్యింది తప్ప, పాత్ర బాగోలేక కాదని స్పష్టత ఇచ్చారు. దాదాపుగా 15 నుండి 20 రోజుల పాటు ‘శ్రీమంతుడు’ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొన్నానని, తన వరకు సంతృప్తిగానే ఉందని అన్న సుబ్బరాజు, తన రియల్ లైఫ్ పాత్రకు దగ్గరగా ఉండదని, అయితే కొరటాల శివ కోణంలో నేను అలా కనపడి ఉంటానేమోనని అన్నారు.

ఇక, ఈ ఇంటర్వ్యూ ప్రోమోలలో సస్పెన్స్ థ్రిల్లర్ ను పెట్టిన సుబ్బరాజు ‘సీక్రెట్స్’ కూడా రివీల్ చేసాడు. అర్ధరాత్రి తన బెడ్ రూమ్ క్రిందకి వచ్చింది ఒక పెద్ద కోతి అని, పక్కనే కొండలు ఉండడంతో అక్కడ నుండి తెరిచి ఉన్న గది ద్వారా రూమ్ లోకి వచ్చుంటుందని తెలియచెప్పగా.., స్నేహితుడు కూతురు విషయంలో ఏసీ శబ్దం వలన తలుపు కొట్టినా వినపడకపోవడంతో, తలుపులు కొట్టినా వాళ్ళు తీయలేదని చెప్పి, రెండు కధలకు రొటీన్ తెలుగు సినిమా కధల మార్క్ క్లైమాక్స్ లను ఇచ్చారు సుబ్బరాజు.

ADVERTISEMENT
Latest Stories