రజినీకాంత్ నిరక్షరాస్యుడు: రజినీకాంత్ సామాజిక స్పృహ అభినందనీయం

Subramanian Swamy calls Rajinikanth illiterateసూపర్ స్టార్ రజినీకాంత్ కాసేపటి క్రితం తన రాజకీయ ఆరంగేట్రానికి సంభందించిన ప్రకటన చేసారు. రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్‌ స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి, పరస్పరం స్వీట్లు పంచుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తలైవా పొలిటికల్‌ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో మార్పులు వస్తాయని పేర్కొన్నారు.

ADVERTISEMENT

మరోవైపు రజినీకాంత్ రాజకీయ ప్రకటన తరువాత వచ్చిన రెండు రియాక్షన్లు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ‘‘రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చెప్పాడు. అంతకు మించి వేరే ఏ వివరాలు చెప్పలేకపోయాడు. అతనో నిరక్షరాస్యుడు. ఇదంతా మీడియా హైప్‌ మాత్రమే. తమిళ ప్రజలను రజనీ తక్కువగా అంచనా వేస్తున్నారు. వారు అంత తెలివి తక్కువోళ్లు కాదు. చాలా తెలివైన వాళ్లు. ఎప్పుడెలా స్పందించాలో వాళ్లకు బాగా తెలుసు’’ అని స్వామి వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఇంకో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా రజినీకాంత్ రాజకీయ ఆరంగేట్రం గురించి స్పందించారు. “ఆయనకు ఉన్న సామాజిక స్పృహకు, రాజకీయ ఆరంగేట్రానికి శుభాకాంక్షలు. ఆయనకు స్వాగతం,” అని కమల్ హాసన్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు.

ADVERTISEMENT
Latest Stories