‘సుచి లీక్స్’పై స్పందించిన హీరో!

Suchi leaks - Arya Respondsగత శుక్రవారం అర్ధరాత్రి నాడు గాయని సుచిత్ర కార్తీక్ చేసిన ట్విట్టర్ హంగామాతో నివ్వెరపోయిన కోలీవుడ్ జనాలు ఇప్పుడిప్పుడే కాస్త తేరుకున్నట్లు కనపడుతున్నారు. సుచిత్ర బయటపెట్టిన విషయాలపై గానీ, ఫోటోలపై గానీ, వీడియోలపై గానీ నోరు మెదపడానికి సినీ ఇండస్ట్రీకి చెందిన ఏ ప్రముఖ వ్యక్తి సాహాసించకపోవడం చెప్పుకోదగ్గ విషయమే. ఈ నేపధ్యంలో తాజాగా హీరో ఆర్య “సుచిలీక్స్”పై పెదవి విప్పారు.

సుచిత్ర లీక్ చేసే ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్ అని, వాటిని ప్రజలు నమ్మకూడ‌ద‌ని, సుచిత్ర ఇలాంటి చవకబారు ప్రచారం చేసి బెదిరిస్తోంద‌ని, ఇది ప్రారంభం మాత్రమేన‌ని, ఇక‌పై ఆమె మరిన్ని ఫేక్ వీడియోల‌ను కూడా విడుద‌ల చేయొచ్చ‌ని అన్నాడు. ఇంటర్నెట్, యూ ట్యూబ్‌లో ఇలాంటి నకిలీ వీడియోలు రావ‌డం ఎంతో సాధార‌ణ‌మేన‌ని, వాటికి సినీ న‌టుల పేర్లు జోడిస్తే వైరల్‌ గా మారుతాయని, ప్ర‌జ‌లు వాటిని చూస్తూ ప్రోత్స‌హించ‌కూడ‌ద‌ని అన్నాడు. సుచిత్ర సోష‌ల్ మీడియాలో పెడుతున్న‌వ‌న్నీ నకిలీవని తాను కచ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌ని అన్నాడు ఆర్య.

ADVERTISEMENT

అయితే సుచి చేసిన ట్వీట్స్ లో ఎక్కడా ఆర్య పేరు లేకపోవడం తెలిసిన విషయమే. మరి తాజాగా ఆర్య ఇచ్చిన స్టేట్మెంట్ పర్యవసానాలు ఎలా ఉంటాయో గానీ, సుచిత్ర మాత్రం ప్రస్తుతం ట్విట్టర్ కు దూరంగా ఉన్నారు. ఒకరిద్దరు హీరోయిన్ల న్యూడ్ ఫోటోలు, వీడియోలు లీక్ చేసిన తర్వాత సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ డిలిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని, ఆ ట్వీట్స్ కు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT
Latest Stories