టాలీవుడ్ హీరోయిన్లు రోజూ భర్తలను మారుస్తారా?

Sudheer Babu tweets on MLA Raja Singh  Comments on Women“పద్మావతి” సినిమాపై ఓ మీడియా ఛానల్ పెట్టిన డిబేట్… చివరికి ఓ బిజెపి ఎమ్మెల్యే చేత సంచలన ప్రకటనలు చేయించాయి. ‘పద్మావతి’ సినిమాను ఉద్దేశిస్తూ… హీరోయిన్లు రోజుకోకర్ని మారుస్తారని ఉత్తరాది బిజెపి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తాను కూడా సమర్దిస్తానని స్థానిక బిజెపి ఎమ్మెల్యే రాజ్ సింగ్ వ్యాఖ్యానించడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.

ADVERTISEMENT

టాలీవుడ్ హీరోయిన్లు కూడా రోజుకోక భర్తలను మారుస్తారని, యూ ట్యూబ్ లలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయని, కావాలంటే దీనిపై మరో చర్చ పెట్టండి, తాను కూడా పూర్తి ఆధారాలతో వస్తానని రాజ్ సింగ్ వ్యాఖ్యానించడం ఆయన హేయమైన ఆలోచనలను ప్రతిబింబిస్తోందని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని హీరో సుధీర్ బాబు సోషల్ మీడియా వేదికగా కూడా ఏకరువు పెట్టారు.

అయితే సదరు ఛానల్ బ్రేక్ తీసుకున్న తర్వాత… తాను చేసిన వ్యాఖ్యల పర్యవసానం గమనించుకున్న రాజ్ సింగ్, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, క్షమాపణలు తెలిపారు. ఇటీవల కాలంలో బిజెపి ఎమ్మెల్యేలు చేస్తోన్న వ్యాఖ్యలు శృతిమించుతున్నాయని చెప్పడానికి నిదర్శనంగా ఇలాంటి సంఘటనలు నిలుస్తున్నాయని టాలీవుడ్ వర్గాలు కూడా మండిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories