ప్రమోషన్లు పలు రకాలు ఇప్పుడో కొత్త ట్రెండ్ షురూ

sujeeth Pawan Kalyan movie OG సినిమా తీయడం ఒక ఎత్తయితే దాన్ని మార్కెట్ చేసుకోవడం ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగి థియేటర్లోనే చూడాలన్న కాంక్ష కలిగించడం మరో ఎత్తు. ఈ ప్లానింగ్ లో ఏ మాత్రం తేడా వచ్చినా ఓపెనింగ్స్ రాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. స్టార్ హీరోలకు ఇది పెద్ద సమస్య కాదు కానీ మొదటి రోజు రికార్డులు దక్కాలంటే సాధారణ జనంలోనూ విపరీతమైన అంచనాలు పెంచేయాలి. దానికి సరైన కసరత్తు చేయాలి. సాహో పరాజయం తాలూకు కసిలో ఉన్న దర్శకుడు సుజిత్ ఇప్పుడు చేయబోయే పవన్ ఓజితో కొత్త ట్రెండ్ తీసుకొచ్చేశాడు.

స్క్రిప్ట్ అయిపోయింది. అందులో మొదటి సీన్ ఏంటో చెప్పేయాలి. కథా నేపధ్యాన్ని రివీల్ చేయాలి. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా కొన్ని యానిమేటెడ్ విజువల్స్ పొందుపరచాలి. కంటెంట్ ఎలా ఉండబోతోందో క్లూస్ ఇవ్వాలి. ఇలా కంప్యూటర్ ప్రోగ్రాం కోసం ఫ్లో ఛార్ట్ గీసినట్టు సుజిత్ ఓజి కోసం చేయించిన వీడియో సోషల్ మీడియాని ఊపేస్తోంది. అసలు రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే ఆన్ లైన్లో ఇంత హంగామా జరగడం ఇప్పటిదాకా ఒక్క రాజమౌళి చిత్రాలకు తప్ప గతంలో ఏ ప్యాన్ ఇండియా మూవీకీ జరగలేదు.

ADVERTISEMENT

అంచనాలు ఎంత పెరిగితే బిజినెస్ లెక్కలు అంతగా మారిపోతాయి. అందుకే డివివి దానయ్య బృందం సుజిత్ చెప్పిన క్రియేటివ్ ఐడియాలకు ఎస్ చెప్పేసింది. దానికి తగ్గట్టే అతగాడు ఒక్కసారిగా అభిమానుల్లో కదలిక తెచ్చాడు. సిద్ధమవుతున్న వినోదయ సితం రీమేక్, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ల కన్నా ఎక్కువగా ఒక్కసారిగా తన మూవీ వైపు అటెన్షన్ వచ్చేలా చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇది అందరూ ఫాలో అయినా ఆశ్చర్యం లేదు. ఎవరో ఒకరు మొదలుపెడితేనే కదా ఆ దారిలో అందరూ రావడానికి

ఇంకో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో వీలైనంత వేగంగా అన్ని సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యతా ఒత్తిడి రెండూ పవన్ మీద ఉన్నాయి. ఎలక్షన్లలోపు ఇవన్నీ రిలీజ్ అయినా కాకపోయినా ముందైతే గుమ్మడికాయలు కొట్టించేస్తే నిర్మాతలు తమకు అనుకూలంగా ఉన్న డేట్లలో ప్లాన్ చేసుకుంటారు. ఓజి స్ట్రెయిట్ సబ్జెక్టు కావడంతో పాటు మాస్ ఎలివేషన్లకు స్కోప్ ఉన్న గ్యాంగ్ స్టర్ డ్రామా కావడంతో ఫ్యాన్స్ దీన్నుంచి చాలా ఆశిస్తున్నారు. ఇదే జానర్ లో వచ్చిన పంజా టేకింగ్ సరిగా లేక ఫెయిలయ్యింది. కానీ ఓజి మాత్రం అభిమానులు గెలుపు గుర్రంలాగే చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories