మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించలేకపోయానని అలనాటి నటిమణీ సులక్షణ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. చిరంజీవి మంచి డ్యాన్సర్ అని, తాను కూడా క్లాసికల్ డ్యాన్సర్ ని అని, అందుకే ఎలాగైనా చిరుతో స్టెప్ వేయాలని భావించానని, ఆయన పక్కన నటించాను కానీ, హీరోయిన్ గా మాత్రం చిందేయలేదని మెగాస్టార్ పై అభిమానాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెలిబుచ్చారు.
‘బేబీ డాలీ’గా బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించిన తాను, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శుభోదయం’ చిత్రం ద్వారా హీరోయిన్ పాత్రలు పోషించానని చెప్పుకొచ్చారు. తన అసలు పేరు శ్రీదేవి అని, అప్పటికే ఒక శ్రీదేవి చిత్ర రంగంలో ఉండటంతో, తన పేరును సులక్షణగా మార్చారని, తన పేరు మార్పుకు కారణం ఆ ‘అతిలోకసుందరి’ అంటూ చమత్కరించారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



