ఆ ఒక్క ఫోటోలోనే నేను లేను… అదే బయటపెట్టారు..!

Sumanth Clarification on Naga Chaitanya Samantha Weddingగోవా వేదికగా జరిగిన నాగచైతన్య వివాహంలో ‘అక్కినేని’ కుటుంబం మొత్తం పాల్గొంది, ఒక్క హీరో సుమంత్ తప్ప! ఏ కారణాలతో సుమంత్ హాజరు కాలేదో? అంటూ వివాహం సందర్భంగా విడుదల చేసిన చైతూ గ్రూప్ ఫోటోను చూపిస్తూ… సోషల్ మీడియా వేదికగా జరిగిన వివాదం తెలిసిందే. దీనికి తోడు నాగ్ – సుమంత్ మధ్య విభేదాలు నెలకొన్నాయని పుకార్లు షికార్లు చేసాయి.

ADVERTISEMENT

అయితే దీనిపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుమంత్ స్పష్టత ఇచ్చారు. నిజానికి ఆ వివాహం మొత్తంలో తాను ఉన్నానని, ఆ మరుసటి రోజు జరిగిన రిసెప్షన్ లో కూడా ఉన్నానని, బహుశా ఆ ఒక్క ఫోటోలోనే తాను లేను, అదే బయటపెట్టారు అంటూ సింపుల్ గా ఓ చిరుదరహాసం ప్రదర్శించారు. గ్రూప్ ఫోటో కాబట్టి, దీనికి ప్రాధాన్యత దక్కిందని అన్న సుమంత్, “మళ్ళీ రావా” సినిమా ప్రమోషన్ కు నాగ్ ఎందుకు రాలేదో కూడా తెలిపారు.

“మళ్ళీ రావా” సినిమా ప్రమోషన్ కు అఖిల్, చైతూలు వచ్చారు గానీ, బిజీ కారణాలతో తన చినమామయ్య నాగ్ రాలేకపోయారు తప్ప వేరేదేమి లేదని, ప్రస్తుతం నాగ్ దృష్టంతా అఖిల్ ను నిలబెట్టడంలోనే ఉన్నారని, తన కాలం అయిపోయిందని, ఇప్పుడు అఖిల్ కాలమని చాలా ఓపెన్ గా చెప్పేసాడు సుమంత్. ఇంత మొహమాటం లేకుండా మాట్లాడతాడు కాబట్టే సుమంత్ అంటే అభిమానించే ప్రత్యేక అభిమాన వర్గం ఉంది మరి!

ADVERTISEMENT
Latest Stories