టాలీవుడ్ లో నెంబర్ 1 ఎవరు అంటే… ముందుగా గుర్తుకు వచ్చేది మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అన్న రెండు పేర్లే. ఈ ఇద్దరి హీరోల అభిమానులు ‘తమది ఆధిపత్యం అంటే తమది ఆధిపత్యం’ అంటూ సందడి చేసే వైనం అందరికీ తెలిసిందే. అలాగే నవతరం హీరోహీరోయిన్లలో ఎక్కువగా చెప్పే పేర్లు కూడా మహేష్, పవన్ వే. కొందరు మొహమాటం లేకుండా తమ అభిమాన నటుల పేర్లు చెప్పేస్తుంటే… మరికొందరు సేఫ్ గేమ్ ఆడుతుంటారు. కానీ, అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ మాత్రం తనది నిర్మొహమాటమైన తీరని చెప్పకనే చెప్పాడు.
నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతున్న “నరుడా… డోనరుడా…” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అభిమానులతో కలిసి లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కాస్త చమత్కరిస్తూ సమాధానం చెప్పారు. “మీ అభిమాన హీరో ఎవరు?” అన్న ప్రశ్నకు… “తన అభిమాన హీరో మహేష్ బాబు… సారీ పవర్ స్టార్ ఫ్యాన్స్…” అంటూ ఓ చిరునవ్వు చిందించాడు సుమంత్. అయితే తన అభిమాన హీరో పేరు చెప్పి ఊరుకోకుండా పవన్ అభిమానులపై సుమంత్ ఎందుకు చమత్కరించారు? అన్నది హాట్ టాపిక్ అయ్యింది.
ఆడియో ఈవెంట్ తదితర వేడుకలపై ఒక్క పవర్ స్టార్ నామమే జపించాలనే విధంగా పవన్ అభిమానులు చేసిన హంగామాతో బహుశా సుమంత్ కూడా విసిగి వేసారి పోయున్నారా? తనకు నచ్చిన హీరో పేరు పవన్ కళ్యాణ్ అని చెప్తారని… సుమంత్ జవాబు గురించి ముందే పవర్ స్టార్ అభిమానులు ఫిక్స్ అయిపోయి ఉంటారా? అందుకే మహేష్ పేరు చెప్పిన వెంటనే పవన్ అభిమానులకు సుమంత్ సారీ చెప్పాల్సి వచ్చిందా? ఏమో విషయం ఏదైనా సుమంత్ చెప్పిన సారీ సినీ జనాల్లో హాట్ టాపిక్ గా మారింది.
My Favourite Hero Is @urstrulyMahesh .. Sorry Powerstar Fans – @iSumanth #NarudaDONORuda pic.twitter.com/DQL9bpYcp5
— Mahesh Babu Fans (@UrsCoolPrince) November 2, 2016



