పవన్ కళ్యాణ్ గురించి రజనీకాంత్ ఏమన్నారు?

pawan kalyan rajinikanth“కృష్ణాష్టమి” సినిమాతో ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తున్న సునీల్, ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పలు మీడియాలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో భాగంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు.

ADVERTISEMENT

రజనీకాంత్ గారితో ‘కధానాయకుడు’ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడున్న పేపర్ చూస్తున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘జల్సా’ ఫోటో కనపడగా, అది చూపించి ఈ సినిమాకు దర్శకుడు నా స్నేహితుడే సార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పగా, నాకు తెలుసు త్రివిక్రమ్… విన్నాను అంటూ రజనీ బదులిచ్చి, ఆ ఫోటోలో ఉన్న పవన్ కళ్యాణ్ ను చూసి… “తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్” ఇతడేనయ్యా… అంటూ చెప్తే తానూ ఆశ్చర్యపోయానని సునీల్ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఎక్కడో కలిసిన సమయంలో కూడా తానూ ఈ విషయాన్ని ప్రస్తావించానని, మీకు ఎలా తెలుసో చెప్పండి సార్… అలాంటి శక్తులు ఉంటే కాస్త నా జీవితం కూడా చెప్తారేమోనని అడుగుతున్నా… అని చెప్తూ సునీల్ నవ్వేసాడు. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయినా, ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదని కూడా సునీల్ స్పష్టం చేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది. పవర్ స్టార్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories