టాలీవుడ్ బ్యూటీ అనుష్కకు, బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కు ఏమైనా పొంతన ఉందా? కానీ సన్నీ లేటెస్ట్ పోస్టర్ ను చూస్తే గుర్తుకు వచ్చేది అందాల బొమ్మ అనుష్కనే. “వీరమదేవి” పేరుతో తెరకేక్కుతోన్న సినిమాలో సన్నీ లియోన్ టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కత్తి, విల్లు పట్టుకుని ఉన్న ఈ పోస్టర్ లో సన్నీలియోన్, ‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్క మాదిరి కనపడుతోంది.
ఒక విధంగా చెప్పాలంటే… ఆ ‘వీరమదేవి’ టైటిల్ స్థానంలో ‘రుద్రమదేవి’ మరియు సన్నీ స్థానంలో అనుష్క ఉన్న పోస్టర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గుణశేఖర్ రూపొందించిన తెలుగు పోస్టర్ ఇంకా నాణ్యతగా ఉంటుంది గానీ, ఈ ‘వీరమదేవి’ పోస్టర్ లో కనీసం ఆ నాణ్యత కూడా కొరవడింది. విశేషం ఏమిటంటే… ఈ సన్నీ సినిమాను తెలుగులో ‘వీరమహాదేవి’గా డబ్ చేస్తూ విడుదల చేస్తున్నారు.



