‘పోర్న్ స్టార్’గా ఇండియాలో అడుగు పెట్టిన సన్నీలియోన్ కు బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరచడంతో, వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఓ పక్కన సినిమాలు, మరో పాకన ఐటమ్ సాంగ్స్ తో సిల్వర్ స్క్రీన్ ను హోరేత్తిస్తోన్న సన్నీ, త్వరలోనే యూ ట్యూబ్ ను హీట్ ఎక్కించే ప్రణాళికను సిద్ధం చేసింది.
తన జీవితాన్ని వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు అందించాలని సన్నీ నిర్ణయించుకుంది. సన్నీలియోన్ అసలు పేరైన ‘కరణ్‌జీత్ కౌర్’లోని ‘కరణ్‌జీత్’ అనే పదాన్ని ఈ వెబ్ సిరీస్ కు నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో టైటిల్ రోల్ సన్నీ పోషిస్తుందా? లేదా మరెవరైనా పోషిస్తారా? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే.
ఈ వెబ్ సిరీస్ అంశాన్ని సన్నీయే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో సన్నీనే స్వయంగా కనిపిస్తుందేమోనన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ సిరీస్‌లో తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆసక్తికరంగా తెరకెక్కించనున్నట్లు ఈ సెక్సీ బ్యూటీ తెలిపింది.



