మలైకా అరోరా ఖాన్ తో వైవాహిక బంధం బద్దలై బాధలో ఉన్న అర్బాజ్ ఖాన్ తో ఓ ఆఫర్ సన్నీలియోన్ తలుపుతట్టిందని, దీంతో సన్నీ ఫేట్ మారిపోనుందని ఇటీవల కాలంలో బాలీవుడ్ మీడియాలో తెగ రూమర్లు చెలరేగాయి. తాజాగా ఈ కధనాలపై స్పందించిన శృంగార తార సన్నీలియోన్, సదరు సమాచారమంతా నిజమేనని తేల్చిచెప్పింది.
“ఇంతెజార్” పేరుతో తెరకెక్కనున్న తన తదుపరి సినిమాలో అర్బాజ్ ఖాన్ తో నటిస్తున్నానని వెల్లడించింది. అర్బాజ్ తో నటించడంపై సంతోషం వ్యక్తం చేసిన ఈ ‘పోర్న్ బ్యూటీ,’ అతనితో నటించడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. జీవితంలో ఎప్పుడేం జరగుతుందో తెలియదు కానీ, జరిగే ప్రతి దానికి ఓ కారణముంటుందని… బాలీవుడ్ తనకు అన్నీ ఇచ్చిందని సంతోషాలు పంచుకుంది సన్నీ.
ADVERTISEMENT
ADVERTISEMENT



