వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘ప్రాణం’ చంద్రబాబు ఆఫీసులో!

suridu-in-chandrababu-officeవైఎస్ జీవించి ఉన్నంత కాలం అంటిపెట్టుకుని వెన్నంటే ఉన్న ‘సూరీడు’ అంటే తెలియని వారుండరేమో! అలాంటి సూరీడు ప్రమాదం జరిగిన రోజు మాత్రం వైయస్ వెనుక లేరు. స్వయంగా వైయస్ తన వెంట రావద్దని చెప్పడంతో ఆగిపోయినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, అప్పుడు కనుమరుగైన ‘సూరీడు’ గురువారం నాడు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.

‘బినామీ’ రాజకీయాలను వైసీపీ తెరపైకి తెచ్చిన నేపధ్యంలో సూరీడు సిఎం క్యాంప్ ఆఫీసులో దర్శనమివ్వడం పలు చర్చలకు తావిచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగానే కాక, వైయస్ ‘బినామీ’గా, రాజశేఖరుడి ‘ప్రాణం’గా సూరీడుకు ఉన్న పేరు రాజకీయ విజ్ఞులకు విదితమే. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సూరీడుపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే సూరీడు చంద్రబాబు చెంతకు రావడానికి గల కారణాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు.

ADVERTISEMENT

సుదీర్ఘ కాలం పాటు అజ్ఞాతంలో ఉన్న సూరీడు అకస్మాత్తుగా సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షం కావడం పట్ల ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు చోటు చేసుకోబోతుందనే టాక్ ఊపందుకుంది. మరో విశేషమేమిటంటే… సూరీడుకు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ ఇచ్చిన విషయం ముఖ్య నేతలకు కూడా తెలియదట. దీంతో ఈ భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories