‘గజినీ’ తర్వాత హీరో సూర్యకు అంతటి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమాలలో ‘సింగం’ సినిమా ఒకటి. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల కాగా, రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం సెట్స్ పైనున్న ‘సింగం 3’ విడుదల తేదీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ, దీనిపై స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం.
‘సింగం 3’ తాజా పోస్టర్ విడుదల సందర్భంగా, సూర్య ఫ్యాన్స్ కు సెన్సేషనల్ న్యూస్ అందిస్తూ… విడుదల తేదీని కూడా నిర్మాణ సంస్థ ధృవీకరించింది. మూడు సింహాలతో కూడుకున్న “సింగం 3” లోగో అదిరిపోగా, డిసెంబర్ 16వ తేదీగా ఖరారు చేయడంతో ఫ్యాన్స్ కు కొత్త సంవత్సరం రెండు వారాలు ముందుగానే ప్రారంభం కానుందని చెప్పవచ్చు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్యకు జోడిగా అనుష్క, శృతిహాసన్ లు నటిస్తుండగా, హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



