సస్పెన్స్ లో పెట్టిన ‘యంగ్ టైగర్’ పోస్టర్! తెలివైన నిర్ణయం!

ntr-movie-dateజూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న “నాన్నకు ప్రేమతో” సినిమా జనవరి 13న విడుదల కావడం లేదంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. బహుశా ఈ టాక్ చిత్ర యూనిట్ వరకు చేరిందో ఏమో గానీ, ఓ 50% సస్పెన్స్ ను తొలగించారు. అయితే మిగిలిన 50 శాతాన్ని చిత్ర యూనిట్ ఎప్పుడు తీరుస్తుందో చూడాలి.

పుకార్లకు స్వస్తి పలుకుతూ “సంక్రాంతి విడుదల” అన్న “నాన్నకు ప్రేమతో” పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఓ సూట్ కేసు పట్టుకుని ‘యంగ్ టైగర్’ స్టైల్ గా నడిచి వస్తున్న పోస్టర్ ‘బుడ్డోడు’ అభిమానులకు పిచ్చేక్కిస్తోంది. ‘సంక్రాంతి విడుదల’ అని ప్రకటించారే గానీ, విడుదల తేదీని ఇంకా ఖరారు చేయకపోవడం అభిమానుల మదిలో నెలకొన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేయలేదు.

ADVERTISEMENT

అయితే “సోగ్గాడే చిన్నినాయనా”తో పాటు జనవరి 15న విడుదల కావచ్చని విశ్వసనీయమైన సమాచారం. అప్పటికే జనవరి 14న “డిక్టేటర్” విడుదలై ఫలితం తెలిసిపోతుంది కాబట్టి, మరుసటి రోజున “నాన్నకు ప్రేమతో” విడుదల చేయాలని చిత్ర యూనిట్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయంగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories