‘సైరా’పై గుడ్ అండ్ బ్యాడ్!

Amitabh-Bachchan-Didn't-Dropout-from-'Sye-Raa'మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 151వ సినిమా “ఊయ్యాలవాడ నరసింహారెడ్డి” త్వరలోనే రెండవ షెడ్యూల్ ను ప్రారంభించుకోబోతున్న విషయం తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తిగా ముగియక ముందే క్లోజ్ అయిన షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో, మెగా అభిమానులు ఇటీవల ఆవేదన చెందిన విషయం తెలిసిందే. అయితే రెండవ షెడ్యూల్ అంశంలో పూర్తి స్పష్టతతో కూడిన ప్రకటన రావడంతో, ఫ్యాన్స్ కలతకు శుభంకార్డు పడింది.

ADVERTISEMENT

అయితే ఇంతలోనే ‘సైరా’ సంబంధించిన మరో వార్త అభిమానులను కలవరపెడుతోంది. మెగాస్టార్ చిత్ర డిజిటల్ రైట్స్ ను ‘అమెజాన్ ప్రైమ్’ దాదాపుగా 30 కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. చిరు చిత్రానికి ఆ రేంజ్ లో డబ్బులు వస్తే ఇందులో కలవరపాటుకు కారణం ఏంటి? అంటే… ‘అమెజాన్ ప్రైమ్’తో ఒప్పందం కుదుర్చుకున్న సినిమాలన్నీ జయాపజయాలతో నిమిత్తం లేకుండా, విడుదలైన నెల రోజులకే ఆన్ లైన్ ప్రత్యక్షం అవుతున్న విషయం తెలిసిందే.

ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే చెప్పలేం గానీ, ధియేటర్లలో ఉండగానే ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో ధియేటర్ లో కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. ఇటీవల ‘ఎంసీఏ, భాగమతి’ సినిమాల విషయంలో ఇదే జరిగింది. దీంతో ఒకవేళ ‘సైరా’ బంపర్ హిట్ అయినా, నెల రోజులకే ఆన్ లైన్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి, ఇది కలెక్షన్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతిమంగా తమ అభిమాన హీరో సాధించాల్సిన రికార్డులకు ఎసరు వస్తుంది కదాయని అభిమానుల ఆవేదన! అయితే ధియేటర్లలో రిలీజ్ అయిన 30 రోజుల తర్వాత కూడా 30 కోట్లు చెల్లించడమంటే మాటలు కాదుగా..!

ADVERTISEMENT
Latest Stories