చిరు… ఇది నిజమేనా..?

It's-All-over-for-Chiranjeevi-in-Politicsతన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీమ్ లో చేరాలని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెళ్లి సంగీత దర్శకుడు ఇళయరాజాను కోరినట్టు టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తొలుత సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను తీసుకోగా, ఆ తరువాత ఆయన తప్పుకున్నాడు. తరువాత థమన్ ‘సైరా’ ఫస్ట్ లుక్ కు అద్భుత మ్యూజిక్ ఇవ్వడంతో అతని పేరు ఖరారవుతుందని భావించేంతలో ‘బాహుబలి’ ఫేం కీరవాణి తెరపైకి వచ్చారు.

ఇక ఇప్పుడు ఆయన పేరు కూడా పోయి, తాజాగా ‘మ్యూజిక్ మాస్ట్రో’ ఇళయరాజా పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల పద్మభూషణ్ పురస్కారానికి ఇళయరాజా ఎంపిక కాగా, ఆయన్ను అభినందించేందుకే చిరంజీవి వెళ్లారని కొందరు అంటుంటే, చారిత్రక నేపథ్యమున్న సినిమా కాబట్టి, బీజిఎం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కీలకమని, ఇళయరాజా అయితే బాగుంటుందని భావించిన చిరంజీవి ఆయన్ను కలిసి, ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక ఇళయరాజా కూడా అంగీకరించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే… ఇటు మెగా కాంపౌండ్ నుండి గానీ, అటు ఇళయరాజా వైపు నుండి గానీ స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories