‘సైరా’ హైలైట్స్ లో ఖచ్చితంగా ఇవుంటాయ్!

One More Deletion & Addition to 'Sye Raa Narasimha Reddy'మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ఇటీవలే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా, ఫస్టు షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. మల్లయుద్ధం .. కత్తియుద్ధం వంటి పోరాట సన్నివేశాలను భారీస్థాయిలో తెరకెక్కించారు.

హాలీవుడ్ స్టంట్ కొరియో గ్రాఫర్ ‘టోనీ చింగ్’ డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని సినిమాటో గ్రాఫర్ రత్నవేలు అంటున్నారు. ఇంతవరకూ చిరంజీవి చేసిన ఫైట్స్ కి భిన్నంగా .. ప్రత్యేకంగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వుంటాయని చెబుతున్నారు. రెండవ షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేయగా, కానీ ప్రస్తుతం అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories