మెగా ఫ్యాన్స్ కు ఓ స్వీట్ వార్నింగ్!

tammreddy-bharadwaja-on-chiranjeevi-khaidi-no-150మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. మెగాస్టార్ అయ్యుండి ‘అమ్మడు కుమ్ముడు’ అంటూ అర్ధరహితమైన పాటలేంటి… అంటూ విమర్శించిన తమ్మారెడ్డిపై మెగా ఫ్యాన్స్ ఎదురుదాడి చేసారు. దీంతో తాజాగా వివరణ ఇస్తూ ‘నా ఆలోచన’ పేరుతో మరో వీడియోను యూ ట్యూబ్ లో విడుదల చేసారు.

మెగాస్టార్ చిరంజీవిపై ఎలాంటి కామెంట్స్ చేసే హక్కైనా మీ కంటే నాకే ఎక్కువుందని, చిరు నటించిన మొదటి శతదినోత్సవ చిత్రం ‘కోతల రాయుడు’ సినిమాను నిర్మించింది తానేనని, అలాగే చిరు ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మూవీ ‘మొగుడు కావాలి’ నిర్మించింది తానేనని, అప్పటికీ మీలో చాలామంది పుట్టి కూడా ఉండరని మెగా ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఒక రేంజ్ లో ఉన్న చిరు ‘అమ్మడు కుమ్ముడు’ వంటి పాటలు విడుదల చేస్తే చాలా బాదేసిందని, అందుకే తన అభిప్రాయాన్ని చెప్పానని స్పష్టం చేసారు.

ADVERTISEMENT

అయినా చిరంజీవికి ఇండియన్ గవర్నమెంట్ ‘పద్మభూషణ్’ ఇచ్చి సత్కరించిందని, అంటే చిరు జాతి సంపద అని, జాతి సంపదపై కామెంట్ చేసే హక్కు ప్రతి భారతీయుడుకు ఉంటుందని, అలా లేదనే హక్కు గానీ, నన్ను విమర్శించే అధికారం గానీ మీకు లేదని సూటిగా చెప్పారు తమ్మారెడ్డి. అయినా చిరు రేంజ్ కు ‘బాహుబలి’ రికార్డులు కొట్టాలని నేను భావిస్తుంటే, ఏదొక సినిమా చేయాలని మీరు అనుకుంటున్నట్లుగా కనపడుతోందని, నిజంగా 500 కోట్లు వసూళ్లు చేసే సినిమా అంటే చాలా విలక్షణంగా ఉండాలి తప్ప, ఇలాంటి సినిమా చేయకూడదన్నది తన భావంగా తమ్మారెడ్డి వ్యక్తపరిచారు.

ఓ పక్కన బాలీవుడ్ లో పెద్ద హీరోలంతా ‘సుల్తాన్, దంగల్’ వంటి అద్భుతమైన సినిమాలు చేస్తుంటే, ఆ రేంజ్ లో ఉన్న చిరు ఇలాంటి సినిమాలు చేయకూడదని తానూ భావిస్తున్నానని, ఆ స్థాయి సినిమాలలో చిరు నటించాలని మీరు కూడా కోరుకోండి, అదే ‘నా ఆలోచన’గా ఈ సంచలన సినీ పెద్ద చెప్పుకొచ్చారు. ఉన్నదేదో సూటిగా సుత్తిగా మాట్లాడడం తప్ప, మనసులో ఒకటి పెట్టుకుని, బయటకు మరొకటి మాట్లాడే వ్యక్తి తమ్మారెడ్డి కాదు… అన్న పేరు టాలీవుడ్ లో ఉంది. అలాంటి తన వ్యాఖ్యలను మెగా ఫ్యాన్స్ సముచితంగా అర్ధం చేసుకోలేదన్న ఆవేదన ఈ వ్యాఖ్యలలో కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories