‘గాత్రం’ బాగుండటం కోసం తన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు గారు రోజుకు రెండు పొగాకు చుట్టలు తాగేవారని ఆయన తనయుడు బాలకృష్ణ చెప్పారు. అయితే ఇదే అలవాటు తనకు కూడా వచ్చేసిందని, రోజుకు రెండు చుట్టలు కాల్చాల్సిందేనని ‘డిక్టేటర్’ బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య చిన్న నాటి విశేషాలు కొన్ని చెప్పారు. నాన్నగారు తనను ఎప్పుడూ కొట్టలేదని చెప్పిన బాలయ్య, సినిమాల్లో మినహా అన్నయ్య హరికృష్టపై కూడా ఎన్నడూ చెయ్యి చేసుకోలేదని గుర్తు చేసుకున్నారు. ఆయన కొట్టకుండానే తమలో క్రమశిక్షణ పెరిగిందని తెలిపారు.
ఇక పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన బాలయ్య బాబు, అభిమానులను మాత్రం ఆ అలవాటుకు దూరంగా ఉండాలని చెప్పడం గమనార్హం. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ఇంకెంతమంది చుట్టలపై పడతారేమోనని బాలకృష్ణ ఆరోగ్య నీతినియమాలు కూడా చెప్పుకొచ్చారు.





