స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబుకి ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని, ఊహించని గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయనే చెప్పాలి. ఆధారాలు లేని కేసుతో బాబుని అరెస్టు చేశారు ఎదోఒకటి రెండు రోజులలో బెయిలు మీద బయటకు వచ్చేస్తారులే అనుకున్న టీడీపీ శ్రేణులకు గట్టి షాకే ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం.
దాదాపుగా 50 రోజులపాటు బాబుని జైల్లో ఉంచగలిగిన జగన్ ప్రభుత్వం అక్కడితో తన విజయాల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టినట్టుంది.కోర్టులో వాదనలు వాయిదాలు పడడం, న్యాయమూర్తులు తీర్పులు రిజర్వ్ లో ఉంచడం,వైసీపీ ప్రభుత్వం బాబు పై కేసుల మీద కేసులు వేయడం, బాబుకి బైలు రాకపోవడంతో నిస్సహాయంలోకి వెళ్లిపోయిన టీడీపీ శ్రేణులకు బాబు బెయిలు వార్తతో ఇక కాలం కలిసొచ్చినట్టయింది.
ఒక్కో కేసు నుండి కొంచెం కొంచెంగా ఊరట దక్కుతున్న చంద్రబాబుకి ముందుగా తాత్కాలిక బెయిలు నుండి రెగ్యులర్ బెయిలు రావడం ఒక శుభ శకునంగా భావించిన టీడీపీ క్యాడర్ కు తాజాగా వైసీపీ ప్రభుత్వం బాబు పై పెట్టిన మధ్య కేసులో కూడా కొంత ఊరట దక్కిందని చెప్పాలి. ఇరుపాక్షల లిఖిత పూర్వక వాదనలు విన్న హైకోర్టు తీర్పుని రిజర్వ్ లో ఉంచింది. ఫైనల్ తీర్పు వివరించేంత వరకు బాబు పై కానీ కొల్లు రవీంద్ర పై కానీ ఎటువంటి ముందస్తు చర్యలకు పాల్పడొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఈ నెల 29 , 30 న ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక కేసులో హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు జగన్ ప్రభుత్వం వేసిన కేసుల చక్ర వ్యూహం నుంచి త్వరగా బయటపడి ప్రజా సమస్యల పై ప్రభుత్వంతో పోరాడడానికి ప్రజాక్షేత్రంలోకి తిరిగి అడుగుపెట్టాలని తెలుగు తమ్ముళ్లు ఆశపడుతున్నారు.శకునాలు చూస్తుంటే తెలుగు తమ్ముళ్ల ఆశ నెరవేరే సమయం దగ్గర పడినట్టే కనిపిస్తుంది.




