టీడీపీ నుండి 40 మందికి ఉద్వాసన?

Chandrababu Naidu cabinet expansionప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న దాదాపు 30 నుంచి 40 మందికి ఉద్వాసన పలకబోతుందంట తెలుగు దేశం పార్టీ. టీడీపీ అభ్యర్థుల ఖరారుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల నేపథ్యంలో 40 మంది అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించబోతున్నారు.

[m9ad]

ADVERTISEMENT

దీనితో ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది నెలల ముందే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యర్ధుల వ్యూహాలను గమనిస్తూ జాబితాను విడుదల చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఎక్కడైతే పోటీ ఎక్కువగా ఉందో అటువంటి స్థానాల్లో నేతల మధ్య సఖ్యత లేనిపక్షంలో వారిని పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఈ నాలుగేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. సీఎం పలుమార్లు పిలిపించి మాట్లాడినప్పటికీ ప్రవర్తన మార్చుకోని వారికి ఉద్వాసన పలకాలని టీడీపీ నాయకత్వం డిసైడ్‌ అయ్యింది. అదే విధంగా ఇటీవలే చేయించిన సర్వేల ఆధారంగా కూడా టిక్కెట్లు కేటాయించబోతున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories