న్యాయం చేస్తుంది ఒకరు…త్యాగానికి సిద్ధపడుతుంది వేరొకరు…ఫలితం అనుభవిస్తుంది మరొకరు అన్నట్టుగా తయారయ్యింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంధం. ఇక్కడ బలం లేని బీజేపీ పొత్తులో చాల బలంగా తన పట్టు నిలుకుంటుంది.
కానీ బలం పెంచుకున్న జనసేన మాత్రం బీజేపీ కోసం త్యాగాలు చేస్తూ న్యాయం కోసం బలమున్న టీడీపీ వైపు చూస్తుంది. అయితే ఈ పొత్తులో అటు త్యాగాలు చేయక, ఇటు న్యాయం చేయాల్సిన పని లేక ఎక్కువగా లాభపడుతుంది ఒక్క బీజేపీ మాత్రమే.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులోకి బీజేపీ ని చేర్చి కూటమి సృష్టించిన పవన్ బీజేపీ నెత్తిన పాలు కాదు పన్నీరు పోసినట్టే. అలాగే తాజాగా జరిగిన మహా రాష్ట్ర ఎన్నికలలో కూడా బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం చేసి మహారాష్ట్రలో బీజేపీ గెలుపుకు తనవంతు సహకారం అందించారు పవన్. ఇలా ఏ రకంగా చూసుకున్న పవన్ బీజేపీ పెద్దలకు పెద్ద పీట వేస్తున్నారు.
కానీ బీజేపీ పెద్దలు మాత్రం పవన్ ఛరిష్మా ను వాడుకుంటూ తమ బలాన్ని పెంచుకుంటున్నారు కానీ పవన్ కోసం ఏ ఒక్క త్యాగానికి సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారు. తాజాగా జరిగిన రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కూడా బీజేపీ మరోసారి తన బుద్ది బయటపెట్టి పవన్ ను మరోసారి త్యాగమూర్తిగా మార్చేశారు.
Also Read – సైఫ్‌కి టాలీవుడ్ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?
ఇక జనసేన త్యాగానికి, బీజేపీ పట్టుకు మధ్య న్యాయం చేసే పాత్రలో టీడీపీ చేరింది. ఇటు జనసేన కోసం టీడీపీ నేతలు చేసిన త్యాగాలకు గుర్తింపు కావాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి, అటు బీజేపీ తో పొత్తు కోసం జనసేన చేస్తున్న త్యాగాలకు న్యాయం చెయ్యాలంటూ మిత్ర పక్షాల నుంచి వినతులు ఇలా బాబు ఇటు మూడు పార్టీల మధ్య, అటు సొంత నేతల మధ్య నలిగిపోతున్నారు.
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కోసం తన బలమైన స్థానాన్ని త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ అభ్యర్థి వర్మ తన త్యాగానికి తగిన గుర్తింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఎన్నికల ముందు వైసీపీ నేతలు ఎంతలా తనను ప్రలోభ పెట్టినా వైసీపీ కండువా కప్పుకోవడానికి నిరాకరించి కూటమి గెలుపు కోసం నడుం బిగించిన మరో టీడీపీ నేత వంగవీటి రాధా ఇలా మరికొంతమంది నేతలు తమ వ్యక్తిగత స్వార్దాన్ని పక్కన పెట్టి రాష్ట్ర క్షేమం కోసం త్యాగానికి సిద్ధపడ్డారు.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…
వారందరికీ సరైన న్యాయం చేసి తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది అంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటికి దాని కోసం అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఇటు గాడి తప్పిన వ్యవస్థలను గాడిన పెడుతూ పాలన కొనసాగించడం కత్తి మీద సాము లెక్క మారిన బాబుకి ఇప్పుడు పొత్తు ధర్మానికి న్యాయం చేయడం కూడా ఒక సవాల్ గా తయారయ్యింది.
సొంత పార్టీ నేతలను ఒప్పించి, మిత్ర పక్షాలను నొప్పించక పొత్తుకు న్యాయం చెయ్యాలి, త్యాగానికి గుర్తింపు నివ్వాలి. అందులో భాగంగానే నేడు కొణిదెల నాగబాబు ను రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అటు సొంత పార్టీ నేతలైన ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ, వంగవీటి రాధాలకు కూడా తగిన గుర్తింపు నివ్వాలి.