కేసీఆర్ ‘గాయానికి’ జగన్ ‘మందు’ వేయలేరా..?

Jagan KCR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు రహస్య మిత్రులనే ప్రతిపక్షాల వాదనను కేసీఆర్ నిన్న రుజువు చేసుకున్నారు. వారిద్దరూ ఒకరి గెలుపు కోసం మరొకరు పడ్డ తాపత్రయం చూస్తే వీరిద్దరూ పదవిలో ఉంది ఒక్క రాష్ట్రంలో అయినా అధికారం మాత్రం రెండు రాష్ట్రాలలో కొనసాగిస్తున్నారని ఎన్నో మార్లు రుజువు చేసుకున్నారు.

తెలంగాణలో వ్యాపార వ్యవహారాలు నిర్వహించే రాజకీయ నాయకులను ఏపీలో వైసీపీ కి వ్యతిరేకంగా బరిలోకి దిగకుండా కట్టడి చేయడంలో అప్పటి తెరాస ప్రభుత్వం, కేసీఆర్ తనవంతు పాత్ర పోషించారని గట్టిగా ప్రచారం జరిగింది. అలాగే జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని హైద్రాబాద్ లో అరెస్టు చేయడంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం తనవంతు సహకారాన్ని అందించిందనేది RRR విషయంలో స్పష్టమయింది.

ADVERTISEMENT

అయితే కేసీఆర్ జగన్ కోసం ఇంతలా సహకారాన్ని అందిస్తే అందుకు ప్రతిగా జగన్ కొన్ని వేల కోట్లా రాష్ట్ర ప్రజల ఆస్తిని కేసీఆర్ ప్రభుత్వానికి ఒకే ఒక్క సంతకంతో దారాదత్తం చేసారు. అయితే 2023 తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ను అక్కడి ప్రజలు తిరస్కరించడంతో ఈసారి ఏపీలో జరగబోయే ఎన్నికలలో కేసీఆర్ జగన్ గెలుపు కోసం ఎటువంటి ప్రకటనలు చేస్తారు అని ఎదురు చూసిన వారికీ కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు.

ఈసారి ఏపీలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగన్ మరో అవకాశం అందుకోబోతున్నారని తానూ అంచనా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు కేసీఆర్. దీని మీద స్పందించిన టీడీపీ నేత బోండా ఉమా మాట్లాడుతూ అక్కడ కేసీఆర్ కే దిక్కు లేక ఫామ్ హౌస్ లో మంచం పై పడ్డారని, జగన్ మీద అంత ప్రేమ ఉంటే అక్కడే జగన్ కోసం మరో రూమ్ సిద్ధం చేస్తే ఎన్నికలు పూర్తవగానే ఈయన కూడా అక్కడికే వస్తాడని, అక్కడ ఇద్దరు కూర్చొని చింతపిక్కలు ఆడుకోమని మండిపడ్డారు.

తానూ ఓడినప్పటికీ తన మిత్రుడు గెలుపు కోసం కేసీఆర్ ఇంతలా ఆరాటపడున్నందుకైనా తన మరో రహస్య మిత్రుడైన బీజేపీ తో మాట్లాడి కేసీఆర్ కుమార్తె కవితకు బెయిలు ఇప్పించవచ్చుగా అనే వాదన తెర మీదకు వచ్చింది. తన సొంత బాబాయ్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా గడిచిన ఐదేళ్ల నుంచి కాపు కాస్తున్న జగన్ లిక్కర్ కేసులో అరెస్టయిన కవితకు బెయిలు తీసుకు రాలేరా..? కేసీఆర్ కోసం ఈ మాత్రం సాయం కూడా జగన్ చేయలేకపోతున్నారా..?

ఒక దశాబ్ద కాలం నుండి బెయిలు మీద ఉంటూ పదవులు అనుభవిస్తున్న జగన్ కు బెయిలు తీసుకురావడం అంటే వెన్నతో పెట్టిన విద్యగానే భావించాలి అంటూ సోషల్ మీడియాలో కేసీఆర్, జగన్ బంధం పై చర్చ జరుగుతుంది. తన డ్రైవర్ ను చంపి ఆ హత్య కేసులో జైలుకెళ్లినా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ను ఇట్టే బెయిలు మీద బయటకు తీసుకురాగలిగారు. అలాగే తన మీద ఉన్న కోడికత్తి కేసు విచారణకు హాజరుకాకుండా ఐదేళ్లు మ్యానేజ్ చేసుకోగలిగారు.

ఇలా ఇన్ని కేసులను తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన జగన్ కేసీఆర్ కుమార్తె కవిత కేసు విషయంలో ఎందుకు మోనం వహిస్తున్నారో..? తన ఆప్త మిత్రుడు ఆపద పట్ల జగన్ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏమిటో..? కేసీఆర్ గాయానికి జగన్ మందు వేయలేకపోయినప్పటికీ కేసీఆర్ మాత్రం జగన్ గెలుపు కోసం ఆరాట పడడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ఆ కారుకి ఈ ఫ్యాన్ కు మాత్రమే తెలుసు సుమీ..!

ADVERTISEMENT
Latest Stories