Nara-Lokesh-Red-Diary

దేశ ప్రధానిగా మూడో సారి హ్యాట్రిక్ కొట్టి మోడీ 3 .0 ను మొదలుపెట్టింది ఎన్డీయే కూటమి. అయితే ఎన్డీయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని కి అవకాశం దక్కగా బీజేపీ నుండి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కు అదృష్టం తలుపుతట్టింది.

అలాగే తెలంగాణలో బీజేపీ నుండి నెగ్గిన బండి సంజయ్, కిషన్ రెడ్డి లకు కేంద్ర క్యాబినెట్ లో బెడ్త్ కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఇక ఢిల్లీ పంచాయితీ ముగిసింది అని సంబరపడే లోపే రాష్ట్రంలో మంత్రి వర్గం పై ఊహాగానాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 164 సీట్లతో అనూహ్య విజయాన్ని అందుకున్న టీడీపీ కూటమిలో ఆశావహుల సంఖ్య కూటమి విజయంలా ఉంటే
మొదటి దఫాలో దక్కే పదవులు మాత్రం వైసీపీ సీట్ల మాదిరి ఉన్నాయి.

Also Read – ఏపీలో వైసీపి లేదు… జగన్‌ ఒక్కరే ఉన్నారట!

అయితే కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ శాఖను ఎంచుకుంటారో అంటూ మీడియాలో ఊహాగానాలు మొదలుపెట్టారు. అయితే మొదటి నుంచి సీఎం, సీఎం అంటూ అరుస్తూ తమ ఆశలను, ఉత్సహాన్ని పవన్ చెవినపడేస్తున్న జనసేన అభిమానులకు ఈసారికి ఆ ఛాన్స్ లేకపోవడంతో పవన్ హోమ్ శాఖ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అభిమానుల ఆశలు, అంచనాలు ఎలా ఉన్నా పవన్ ఒక క్లారిటీతో ఉంటారు అనేది ఈ ఎన్నికలలో 100 % స్ట్రైక్ రేట్ సాధించి నిరూపించుకున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణ మీద ఇరు పార్టీల అధినేతలు సుదీర్ఘ చర్చలు జరిపి అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తారనేది తేటతెల్లమయినప్పటికీ వైసీపీ నేతల ఐదేళ్ల అరాచకాల పొద్దును సిద్ధం చేసిన లోకేష్ దానికి రెడ్ బుక్ గా నామకరణం చేసారు.

Also Read – చెక్కుచెదరని ఎన్టీఆర్ బ్రాండ్

దీనితో ఈసారి కూటమి ప్రభుత్వంలో ఉండబోయే హోమ్ మినిస్టర్ మీదే అందరి ద్రుష్టి పడింది. ఈ రెడ్ బుక్ లో ఉన్న ఈ చిట్టా పొద్దు లెక్క తేల్చేదెవరు.? ఈ రెడ్ బుక్ కు న్యాయం చేసే బాధ్యత తీసుకునేదెవరు.? అనేదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉంటుందో చూపిస్తా అంటూ ఎన్నికల ప్రచారంలో పవన్ పదేపదే నొక్కి వక్కాణించడంతో పవనే హోమ్ మంత్రి కావాలంటూ జనసేన అభిమానులు కోరుకుంటున్నారు.

అలాగే అసలు రెడ్ బుక్ సృష్టికర్త లోకేష్ దానికి పూర్తి న్యాయం చేయగలరు అంటూ అటు టీడీపీ మద్దతుదారులు భావిస్తున్నారు. అయితే పదవి ఎవరు తీసుకున్నా, అధికారం కూటమి నేతలదే అన్నట్టుగా బాధితులకు న్యాయం చేయగలగాలి. రాష్ట్ర క్షేమం కోసం ఏర్పడిన పొత్తు ఆ లక్ష్యం చేరే వరకు కొనసాగాలని దానికి తగ్గట్టే ఇరు పార్టీల నేతలు పదవుల కోసమో పార్టీల కోసమో కాకూండా పాలన మీద దృష్టిపెట్టాలని ఆశిద్దాం.

Also Read – ఉండవల్లిలో జగన్‌ మ్యూజియం… భేష్ మంచి ప్రతిపాదనే!