టీడీపీ తెరాస పొత్తు ప్రయత్నాలను మరోసారి ప్రస్తావించిన చంద్రబాబు

Court rejects chandrababu-- naidu pleaతెలంగాణలో ముందస్తు ఎన్నికలు తెదేపాను దెబ్బతీసేందుకేనని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అమరావతిలో ఆయన మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కీలక అంశాలపై చర్చించారు. ఓటుకు నోటు కేసుపై ఉన్నఫళంగా వస్తున్న కదలికను కూడా చంద్రబాబు స్పందించారు.

[m9ad]

ADVERTISEMENT

తెరాస – టీడీపీ రెండు పార్టీలూ రాజకీయంగా కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే సంకేతాలను గతంలో తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినా.. ప్రధాని నరేంద్ర మోదీ మాయలో పడిన ఆయన అందుకు అంగీకరించలేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం. చంద్రబాబు ఇదే విషయాన్నీ గతంలో కూడా స్పందించారు.

అయితే ఇప్పటివరకు దానిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించకపోవడం గమనార్హం. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీ విషయంలోనూ ఇదే తరహా దాడులు జరిగే అవకాశం ఉందని ఒక మంత్రి ప్రస్తావించగా ఎన్నికలలో టీడీపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా ఇవన్నీ జరుగుతున్నాయని వాటికి భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారట.

ADVERTISEMENT
Latest Stories