ఈసారి టిడిపియే అధికారంలోకి వస్తుంది: బిజెపి జోస్యం

Bad Name For Tirupati Due To Jagan: Telangana MLAఈసారి ఆంధ్రప్రదేశ్‌లో టిడిపియే అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఓ బిజెపి ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. అదీ… పొరుగు రాష్ట్రంలోని బిజెపి ఎమ్మెల్యే… రాజాసింగ్!

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాననే వార్తలలో నిజం లేదు. నన్ను టిడిపియే కార్పొరేటర్‌గా పోటీ చేయించి రాజకీయాలలోకి తెచ్చిన మాట వాస్తవం. కానీ నా మైండ్ సెట్‌కి బిజెపి మాత్రమే సరిపోతుంది. కనుక నేను ఎప్పటికీ బిజెపిలోనే ఉండాలని కోరుకొంటున్నాను. నాపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకొని హిందూధర్మం, గోరక్షణ కోసం పాటు పడతాను తప్ప వేరే పార్టీలో చేరను,” అని చెప్పారు.

ADVERTISEMENT

తర్వాత చంద్రబాబు నాయుడుని ప్రశంశిస్తూ, “చంద్రబాబు నాయుడే హైదరాబాద్‌ నగరానికి ఐ‌టి కంపెనీలు తీసుకువచ్చి అభివృద్ధి చేశారు. ఒకవేళ ఆయన రెండోసారి కూడా ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే నేడు హైదరాబాద్‌ నగరానికి ధీటుగా అమరావతిని అభివృద్ధి చేసి ఉండేవారు. అక్కడా అనేక ఐ‌టి కంపెనీలను తెచ్చి ఏపీని అభివృద్ధి చేసి ఉండేవారు. గత ఎన్నికలలో టిడిపి ఓడిపోయినప్పటికీ ఈసారి జరుగబోయే ఎన్నికలో తప్పకుండా గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలా దిగజారిపోయింది కనుకే కేసీఆర్‌ ఇంతగా గొప్పలు చెప్పుకోగలుగుతున్నారు,” అని రాజాసింగ్‌ అన్నారు.

కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌ ఐబీఎం పూర్వ విద్యార్థుల సమావేశం జరిగినప్పుడు విదేశాలలో స్థిరపడిన అనేకమంది వచ్చి, చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో హైదరాబాద్‌లో ఐబీఎంను ఏర్పాటుచేసినందునే, నేడు తాము ఈ స్థాయికి చేరుకోగలిగామని నేటికీ ఐబీఎం వేలాదిమంది మేధావులను ప్రపంచానికి అందజేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టికి ఐబిఎం ఓ నిదర్శమని అన్నారు.

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్‌ శుక్రవారం విజయవాడ వచ్చినప్పుడు ఆయన కూడా ఇదే చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్‌ దేశంలో నంబర్: 1 రాష్ట్రంగా ఎదుగుతుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గొప్పదనాన్ని రాష్ట్రంలోవారు గుర్తించలేకపోతున్నారు కానీ బయట ఉన్న తమవంటివారికి ఆయన మంచి సమర్ధుడు, దూరదృష్టి కలిగిన మంచి పరిపాలనాదక్షుడని తెలుసునని అన్నారు.

వైసీపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు ఎమ్మెల్యేలు వరకు అందరూ చంద్రబాబు నాయుడు గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటారు. తమ మంత్రిత్వశాఖల గురించి ఏమాత్రం అవగాహన లేని కొందరు మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గురించి చులకనగా మాట్లాడుతుంటారు. కానీ పొరుగు రాష్ట్రాలలో వారు చంద్రబాబు నాయుడు విలువని గుర్తించమని హితవు చెపుతున్నారు. ఎవరైనా వింటే కదా?

ADVERTISEMENT
Latest Stories