తెలంగాణ బీజేపీ రాజకీయంలో రాష్ట్రపతి జోక్యం?

Telangana BJP President Dr K Laxman meets President of India ram nath kovindతెలంగాణలో ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యల విషయన్ని చాలా కాలంగా సీరియస్ గా తీసుకుని తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు దాని కోసం రాష్ట్రపతిని కూడా వాడుకోవడం గమనార్హం. తెలంగాణ లోఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆయన కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ కేంద్ర హోం శాఖ ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి లేఖ రాసింది.

ఈ వ్యవహారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఇతర నేతలు జులై 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు.27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని వివరించారు. సరే రాష్ట్రపతి వివరణ కోరారు ఓకే కానీ ఆయన అలా వాస్తవ నివేదిక కోరారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాకు చెప్పారు. దీనిబట్టి బీజేపీ రాజకీయం ఏ స్థాయి ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

డైరెక్టుగా రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకుంది అంటే బీజేపీ తెలంగాణను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వారి రాజకీయానికి ఏకంగా రాష్ట్రపతి కార్యాలయాన్ని వాడుకోవడమే బాధాకరం. అలాగే ఈ విషయంలో కొంత లేటుగా కూడా స్పందించినట్టు అనిపిస్తుంది. ఆ ఘటన జరిగిన వెంటనే రాష్ట్రపతి గనుక కలుగజేసుకుంటే కాషాయ పార్టీకి మరింత రాజకీయ మైలేజ్ వచ్చేది.

ADVERTISEMENT
Latest Stories