Jagan-Kcr

తెలంగాణ ఉద్యమాలతో ఆ తర్వాత ముఖ్యమంత్రిగా దాదాపు రెండు దశాబ్ధాలపాటు తెలంగాణ రాజకీయాలను శాశించిన కేసీఆర్‌, చివరికి ఆనాడు తాను హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్‌ చేతిలోనే ఓడిపోవడం విచిత్రం. కేసీఆర్‌ తన రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా నిలబెట్టారు. పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలతో లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. బీడువారిన భూములకు సాగునీటిని అందించి రైతులు మూడు పంటలు పండించుకొనేందుకు తోడ్పడ్డారు. ప్రజలకు నిజంగానే మేలు చేసే అనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలుచేశారు.

కనుక తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కేసీఆర్‌ పరిపాలన సాగించిన్నట్లు అర్దమవుతోంది. అయినా ప్రజలు ఆయనను వద్దనుకొన్నారు. అది వారిష్టం… వారి నిర్ణయం. దానిని గౌరవించాల్సిందే.

Also Read – జగన్‌ మావయ్యా… నారా లోకేష్‌ని నేర్చుకో!

ఈ నేపధ్యంలో ఆంధ్రాలోని వైసీపి ప్రభుత్వ భవిష్యత్‌ని చూస్తే, దానికీ రేపు ఇటువంటి ముగింపే రావచ్చనిపిస్తుంది. సంక్షేమ పధకాలు, వాలంటీర్లు, రంగులు, రాజకీయ కక్షలు, కేసులు, అరెస్టులు, కూల్చివేతలనే వైసీపి విధానాలుగా మార్చుకొని ఎన్నికలకు సిద్దమవుతోంది. అన్నీ చేసిన కేసీఆర్‌ని ఆదరించని ప్రజలు, ఏమీ చేయని తమని ఆదరిస్తారా?అని వైసీపి నేతలు తమను తాము ప్రశ్నించుకొంటే సమాధానం వారికే లభిస్తుంది.

ఆనాడు చంద్రబాబు నాయుడుని గద్దె దించేందుకు రాజకీయ శక్తులన్నీ ఏవిదంగా ఏకమయ్యాయో, ఇప్పుడు కేసీఆర్‌ని గద్దె దించడానికి కూడా అదేవిదంగా ఏకమయ్యాయి. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది కదా?

Also Read – కొండెక్కాలనుకుంటే ఫ్లయిట్ ఎక్కించారు.! అయినా…

టిడిపి, జనసేనలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. ఒకవేళ బీజేపీని దూరంగా ఉంచితే, వాటితో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని వామపక్షాలు చెపుతున్నాయి. వాటికి తోడేళ్ళ గుంపు, కుక్కలు, గుంట నక్కలని పేర్లు పెట్టుకొని ఈసడించుకోవచ్చు గాక. కానీ అటువంటి శక్తులే కలిసి అత్యంత శక్తివంతుడైన కేసీఆర్‌ని గద్దె దించేశాయి కదా?

ఈ పార్టీల సమీకరణాలను పక్కన పెడితే, రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలను నడిపిస్తూ వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న బలమైన కమ్మ సామాజికవర్గాన్ని దొంగలు, ద్రోహులు, రాష్ట్రాన్ని దోచుకొనే నేరస్తులన్నట్లు వైసీపి నేతలు మాట్లాడుతున్నారు. వారినే దోషిగా చూపిస్తూ అమరావతిని పాడుపెట్టేసింది.

Also Read – మావాళ్ళు నాలుగు రాళ్ళు విసిరారు అంతే: జగన్‌

ఆ కారణంగా అమరావతి రైతులు అభ్యంతరం చెపితే వారినీ ఉక్కుపాదంతో అణచివేసింది. ఓ పక్క వైసీపి నేతల సామాజిక సాధికార యాత్రలు, మరోపక్క బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజలపై దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారు కూడా వైసీపి పట్ల ఆగ్రహంతోనే ఉన్నారు.

తమ ప్రభుత్వ అనుచిత నిర్ణయాలను, విధానాలను ప్రశ్నిస్తున్నందుకు మీడియాకు ఎల్లో రంగు పూసేసి వాటినీ వైసీపి ప్రభుత్వం ద్వేషిస్తూనే ఉంది. ప్రతిపక్షాలంటే చులకన, ప్రజల ఆకాంక్షలు పట్టవు. మీడియా గిట్టదు. ఇవన్నీ సరిపోవన్నట్లు అప్పులు, అవినీతికి అంతే లేకుండా పోయింది.

తెలంగాణను ఎంతగానో అభివృద్ధి చేసి చూపిన కేసీఆర్‌ను ప్రజలు వద్దనుకోవడానికే ఇటువంటివే అనేక కారణాలు కనబడుతున్నప్పుడు, అంతకంటే దారుణమైన పాలన సాగిస్తున్న వైసీపిని ప్రజలు కావాలనుకొంటారా? వద్దనుకొంటారా?వైసీపీ నేతలే ఆలోచించుకోవాలి.