తెలంగాణా మంత్రికి తృటిలో తప్పిన పెనుప్రమాదం!

Jogu Ramanna, Jogu Ramanna Accident, Telangana Minister Jogu Ramanna Accident, TRS Minister Jogu Ramanna Accident, Telangana Forest Minister Jogu Ramanna Accidentతెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన కాన్వాయ్ లోని వాహనాలు 44వ నెంబర్ జాతీయ రహదారిపై వెళుతున్న వేళ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ ముందు కర్నూలు నుంచి నిర్మల్ వెళుతున్న ఓ బొలెరో వాహనం వెనుక టైర్ ఊడిపోయింది.

ఆ బొలెరో వాహనానికి వెనుకనే వేగంగా వస్తున్న మంత్రి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం బొలేరోను ఢీ కొట్టగా దీనిలోని పోలీసులకు గాయాలు అయ్యాయి. ఆ వెనుకే జోగు రామన్న కారును నడుపుతున్న డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, సడన్ బ్రేకుతో వాహనాన్ని ఆపేశాడు. ఆపై వాహనం దిగిన మంత్రి ఎస్కార్ట్ సిబ్బందికి ఏమైనా ప్రమాదం జరిగిందా? అని విచారించి తన ప్రయాణాన్ని కొనసాగించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories