ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ నేతలు నిత్యం భజన చేస్తుంటారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ భజన చేస్తుంటారు.
Also Read – పిఠాపురం పంచాయితీ తీరినట్టేనా.?
ఏపీలో మంత్రులు మరో అడుగు ముందుకు వేసి ‘మా నమ్మకం నువ్వే… మా భవిష్యత్ నువ్వే… మేము గెలిచేది నీ ఫోటోతోనే… నీ పేరు చెప్పుకొనే… మేమంతా నిమిత్తమాత్రులం అంటూ వీరభజన చేస్తుంటారు. తెలంగాణలో కూడా కాస్త అటూ ఇటూగా ఇదే భజన జరుగుతుంటుంది. ఇది సహజమే.
కనుక ఈ ‘విధేయతా పోటీలలో’ నెగ్గినవారికి టికెట్లు, ఎన్నికలలో గెలిస్తే మంత్రి పదవులు లభిస్తుంటాయి. తెలంగాణలో కేసీఆర్ ఒకసారి ఎవరికైనా ‘వీరతాడు’ వేసి ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇస్తే వారికి ఇక వారికి ఢోకా ఉండదు. టికెట్ ‘ఆటో రెన్యూవల్’ అయిపోతుంటుంది.
Also Read – భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!
కానీ ఏపీలో అలాకాదు. జగనన్న ‘వీరతాడు’ వేసి మంత్రి పదవి ఇచ్చినా రెండేళ్ళయ్యేసరికి పక్కనపెట్టేస్తుంటారు. టికెట్ ఇచ్చి గెలిపించుకొన్న ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కూడా వేస్తుంటారు. రాజకీయాలలో ఇవన్నీ చాలా కామన్.
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ విధేయతా పోటీలను మరో లెవెల్‌కు తీసుకువెళ్ళారు. ఆమె తన చేతి మీద సిఎం కేసీఆర్ పేరు పచ్చబొట్టు పొడిపించుకొన్నారు. దీంతో ఆమెకు మరో ‘వీరతాడు’ పడిన్నట్లే. కనుక మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పచ్చబొట్లు పొడిపించుకొన్నా ఆశ్చర్యం లేదు.
Also Read – ఒకేసారి అన్ని హంగులతో అమరావతి.. అందరూ రెడీయేనా?
నేడు తెలంగాణ చేసింది రేపు దేశం ఆచరిస్తుందని అక్కడి మంత్రులు గర్వంగా చెప్పుకొంటారు. కనుక ఆమె ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తారు.
కారణాలు ఏవైతేనేమీ… ప్రజల ఇళ్ళ గోడలకు అంటించిన జగనన్న స్టిక్కర్స్ అప్పుడే ఊడిపోతున్నాయి. కనుక ప్రజలను నమ్మలేము. కానీ వైసీపీ నేతలు జగనన్నను, ఆయన వారిని నమ్ముకొని ఉన్నారు. “మా నమ్మకం… మా భవిష్యత్… అంతా నువ్వే… నువ్వే,” అంటూ జగనన్న భజన చేస్తున్న మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలలో కొంతమంది ‘మాతో టచ్చులో ఉన్నారని’ ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారు.
ఇదీగాక వచ్చే ఎన్నికలలో వైసీపీ మళ్ళీ గెలవాలంటే 30-40 మంది సిట్టింగులను మార్చాల్సిన అవసరం ఉందని ‘ఐ-ప్యాక్’ గత రెండేళ్ళుగా జగనన్న చెవిలో చెపుతూనే ఉంది. కనుక ఐ-ప్యాక్ లిస్టు నుంచి పేరు తీయించేసుకోవాలంటే జగనన్న పేరు పచ్చబొట్టు పొడిపించుకోవడమే మంచిదనిపిస్తోంది.
టిడిపితో టచ్చులో ఉన్నవారిని నమ్ముకొని జగనన్న ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టడం చాలా ప్రమాదం. కనుక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా జగనన్న పేరు, వీలైతే వైసీపీ లోగో పచ్చబొట్లు పొడిపించుకోవాలని జీవో జారీ చేస్తే మంచిదేమో?అప్పుడు పాలకు పాలు… నీళ్ళకు నీళ్ళు వేరైపోతాయి కదా?