‘అయినోళ్ళకు ఆకుల్లో… కానోళ్ళకు కంచాల్లో…’

Railway budget Telangana Andhra Pradeshరైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టి, అంతా చదివి వినిపించిన తర్వాత ఏపీలో ఉన్న రాజకీయ విశ్లేషకులు, నిపుణులు వ్యక్తపరిచిన అభిప్రాయం “అయినోళ్ళకు ఆకుల్లో… కానోళ్ళకు కంచాల్లో…” అని! ఎన్నో ఆశలు పెట్టుకున్న విశాఖ రైల్వే జోన్ అంశం కనీస అసలు ప్రస్తావన కూడా లేకుండా ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్న మోడీ సర్కార్, కంటి తుడుపు చర్యలుగా కొన్నింటిని ప్రస్తావించింది.

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన టిడిపి సర్కార్ పరిస్థితి ఇలా ఉంటే, ఇక తెలంగాణా రాష్ట్రానికి మొండిచేయి చూపించడం తధ్యమని భావించిన వారికి షాక్ నిచ్చే విధంగా మోడీ సర్కార్ తెలంగాణాకు వరలిచ్చింది. అవి కూడా భారీవి కాకపోయినా, ఏపీతో పోల్చుకుంటే, ఆర్ధికంగా బలమైన రాష్ట్రమైన తెలంగాణాకే ఎక్కువ కేటాయింపులు జరిగాయని విశ్లేషకులు తేల్చేసారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పార్టనర్ షిప్ ప్రాజెక్ట్ లో భాగంగా హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, పెండింగ్ లైన్ల కోసం 389 కోట్లు కేటాయించింది. అలాగే రెండు ఆర్.ఓ.బి. బ్రిడ్జ్ లకు గానూ మరో 10 కోట్లు దక్కాయి. ఇక, ఏపీ పరిస్థితికి వచ్చే సరికి 250 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. రాజకీయంగా ఉపకరించే ఈ చర్యలతో ఏపీ సర్కార్ ను ఇబ్బందులు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మరో వైపు చంద్రబాబు పరిస్థితి “కక్కలేక మింగలేక” అన్న చందంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories