ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలలాగే తెలంగాణ మంత్రులు కూడా నిత్యం ప్రతిపక్షాలతో రాజకీయ యుద్ధాలు చేస్తూనే ఉంటారు. అయితే ఆ వార్తల కంటే ఎక్కువగా వారు ఏదో ఓ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభిస్తున్న వార్తలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మరికొందరు మంత్రులు ప్రతీ నెలలో కనీసం 10-15 రోజులు ఏదో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపనలు చేయడమో లేదా పూర్తిచేసిన పనులను ప్రారంభోత్సవం చేస్తుంటారు. అదీ అక్కడి ప్రభుత్వం పనిచేసే తీరు!
తెలంగాణలో ఏ పనికైనా శంకుస్థాపన చేస్తే అది పూర్తయిపోయిన్నట్లే లెక్క! అని అక్కడి ప్రజలకు నమ్మకం ఏర్పడిందంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత విశ్వసనీయత సంపాదించుకొందో అర్దం చేసుకోవచ్చు. మరి ఏపీ ప్రభుత్వానికి ప్రజలలో అటువంటి విశ్వసనీయత ఉందా?
Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?
తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఎక్కువగా తమ జిల్లా లేదా నియోజకవర్గంలో జరిగిన లేదా జరుగుతున్న అభివృద్ధి పనులకి సంబందించిన విషయాలే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. అలాగని వారేమీ మాయమాటలు చెప్పడం లేదు. చేసిన అభివృద్ధి పనులకు సంబందించిన ఫోటోలు, వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటారు.
అదే మన ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏనాడైనా సోషల్ మీడియాలో అభివృద్ధి పనుల గురించి మాట్లాడారా? అంటే లేదనే అందరికీ తెలుసు. ఏపీ మంత్రులు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏం మాట్లాడుతుంటారో అందరూ వింటూనే ఉన్నారు.
Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?
తెలంగాణలో మంత్రులు శంకుస్థాపన చేసిన ఫోటోలు, ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తున్న ఫోటోలను రెంటినీ సోషల్ మీడియాలో పక్కపక్కనే పెడుతూ తమ పనితీరు బాగుందో లేదో ప్రజలనే ఆలోచించుకోమని చెపుతుంటారు. ఏపీ మంత్రులకు అంత ధైర్యం ఉందా?
తెలంగాణ మంత్రులు తాము చేసిన అభివృద్ధి పనులను చూసి తమకు ఓట్లు వేయమని ధైర్యంగా అడుగుతుంటే, ప్రతీ ఇంటికీ సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెడుతున్నాము కనుక మాకే ఓట్లు వేయమని ఏపీ మంత్రులు కోరుతుంటారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలలో దేని విధానం మంచిదో ఏపీ ప్రజలే ఆలోచించుకోవాలసి ఉంటుంది.
Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!
తెలంగాణ తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ వరంగల్ నగరం సమీపంలో ఏర్పాటు చేస్తున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, అక్కడ దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ గ్రూప్ సంస్థకు ఆదివారం శంకుస్థాపన చేయబోతున్నానని చెప్పారు. ఆ సంస్థ రూ.900 కోట్ల పెట్టుబడితో ఒకేసారి అక్కడ 8 పరిశ్రమలను ఏర్పాటు చేయబోతోందని వాటి ద్వారా రాష్ట్రంలో 12,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించబోతున్నాయని తెలియజేశారు. ఇప్పటికే టెక్స్‌టైల్ పార్కు నిర్మాణ పనులు చాలావరకు పూర్తయ్యాయని వాటిలో గణేశా ఎకోటెక్ కంపెనీ ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిందని, కైటెక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించబోతున్నాయని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్కు ఫోటోలు కూడా జత చేశారు. కనుక నమ్మక తప్పదు.
తెలంగాణలో ఇదిగో అభివృద్ధి… మరి ఏపీలో ఎక్కడా?ఇంకా ఎప్పుడు?