స్టార్ హీరో షూటింగ్ వివాదం!

thalapathy vijayడిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు వ్యతిరేకంగా కోలీవుడ్ నిర్మాతల మండలి గత 16వ తేదీ నుంచి బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతలు షూటింగ్ లన్నీ నిలిపివేసి, డిజిటల్ ప్రొవైడర్లతో చర్చలు జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ బంద్‌ ను స్టార్ హీరో విజయ్ ఉల్లంఘించాడంటూ కోలీవుడ్ లో పెనుదుమారం రేగింది.ADVERTISEMENT

బంద్‌ లో కూడా పక్షపాతం చూపించడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీశారు. దీనిపై నిర్మాతల మండలి కార్యదర్శి ఎస్‌ఎస్‌ దురైరాజ్‌ స్పందిస్తూ, మార్చి 16 నుంచి అన్ని సినిమాల షూటింగ్ లు నిలిపేశామని అన్నారు. బంద్ కు వ్యతిరేకంగా ఎవరూ షూటింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఒకట్రెండు రోజుల షూటింగ్ తో సినిమా పూర్తవుతుందన్న వినతులతో 4 సినిమాల షూటింగ్‌ లకు అనుమతిచ్చామని తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories