సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్.థమన్ పేరు ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ట్రేడ్ వర్గాలలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది. వినూత్నమైన కధలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తూ దూసుకుపోతున్న థమన్, మరోసారి ఈ బుధవారం నాడు హంగామా చేయబోతున్నారు.
ADVERTISEMENT
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన “తొలిప్రేమ” సినిమా తొలి టీజర్ విడుదల ఒక వైపు… అందాల బొమ్మ అనుష్క టైటిల్ రోల్ పోషించిన “భాగమతి” ఫస్ట్ టీజర్ రిలీజ్ మరో వైపు… దీంతో మరోసారి థమన్ తన ‘దూకుడు’ను ప్రదర్శించినట్లవుతోంది.
టాలీవుడ్ లో దేవిశ్రీప్రసాద్ అగ్ర స్థానంలో దూసుకుపోతుండగా, ప్రస్తుతం ఆ స్థానానికి థమన్ గట్టిపోటీనే ఇవ్వబోతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించడంలో ఇప్పటికే దేవిని మించి ఒక మెట్టు పైనే ఉన్న థమన్ పాటలను కూడా అదే తరహాలో ఇస్తే… నెంబర్ 1 స్థానం దక్కించుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు.
ADVERTISEMENT



