ట్రైలర్ టాక్ – యాక్షన్ ప్రియులకు పండగ లాంటి సినిమా!

The Fate of the Furious Trailer 2 Talkఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అప్పటివరకు ఉన్న హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టిన సినిమాగా “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7”కు ఓ రికార్డు ఉంది. యాక్షన్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమాలో స్టంట్స్ కు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా దానిని మరింత రెట్టింపు చేసే విధంగా “ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ 8” సిద్ధమవుతోందన్న సంకేతాలను ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

దాదాపుగా 3 నిముషాల పాటు సాగిన ఈ ట్రైలర్ నిండా భారీ యాక్షన్ సన్నివేశాలే దర్శనమిచ్చాయి. “ఎఫ్ 7”లో హెలికాఫ్టర్ నుండి కార్లను విడుదల చేస్తూ సాగిన యాక్షన్ సీన్ ఎంత హైలైట్ అయ్యిందో, ఈ “ఎఫ్ 8”లో స్నోలో తీసిన యాక్షన్ సీన్ అంతకు మించిన హైలైట్ అవుతుందనే నమ్మకాన్ని ఇచ్చింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’లో ఉండే రెగ్యులర్ నటులంతా కూడా ఈ సినిమాలో కూడా సందడి చేయగా, అదనంగా మరో ఇద్దరు అందాల తారామణులు కూడా ఈ “ఎఫ్ 8”లో కనపడనున్నారు.

ADVERTISEMENT

ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ వీక్షకుల కోసం…

ADVERTISEMENT
Latest Stories