ఈ ట్రైలర్ చూస్తే… ఖచ్చితంగా సినిమా చూస్తారు..!

The Fate of the Furious - Official Trailerఫాస్ట్ అండ్ ఫ్యూరియస్… సిరీస్ లోని సినిమాలు భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. 2015లో విడుదలైన “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7” అయితే అప్పటివరకు ఉన్న డబ్బింగ్ సినిమా రికార్డులను కొల్లగొట్టి, సరికొత్త చరిత్రను సృష్టించింది. మరి అలాంటి సిరీస్ లో మరో సినిమా వచ్చే ఏడాది ఇండియన్ సినీ ప్రేక్షకులను పలకరించబోతోంది. “ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్” పేరుతో 2017 ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోతున్న సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించే విధంగా ఉన్న ఈ ట్రైలర్ చూస్తే, ఖచ్చితంగా సినిమా కోసం వేచిచూస్తారు అనే భావన కలగడం సినీ ప్రియులకు సహజమైన విషయమే. గతేడాది విడుదలైన “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7”లో హైలైట్స్ గా నిలిచిన రెండు యాక్షన్ సన్నివేశాలు చూసేందుకే సినీ ప్రేక్షకులు క్యూలు కట్టగా, తాజాగా విడుదలైన ట్రైలర్ లో ‘అంతకు మించి’ అనే విధంగా యాక్షన్ దృశ్యాలు కనపడుతున్నాయి. చూడబోతుంటే… మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనపడుతున్న ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories