ప్యారడైజ్ సౌత్ టూర్ అయిపోవచ్చింది.. ఇంపాక్ట్ సరిపోతుందా ?

Nani during The Paradise promotions

ప్యారడైజ్ సినిమాకి ట్రైలర్ లేకుండానే ప్యాన్ ఇండియా ప్రమోషన్స్ చేసేస్తున్నాడు నాని. చెన్నై, బెంగుళూరు, కొచ్చి వెళ్లి.. అక్కడ మీడియా Q&A అటెండ్ అయ్యి.. వీలైనంత ప్రమోట్ చేశాడు నాని. 21న హైదరాబాద్ లో జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ తో అవుట్ డోర్ ప్రమోషన్స్ పూర్తయినట్లే.

పైన పేర్కొన్న సిటీల్లో జరిగిన ఈవెంట్స్ లో నాని ప్యాన్ ఇండియా సినిమా గురించి చెప్పిన విధానం, బెంగుళూరు ఈవెంట్లో జడల గురించి జరిగిన రచ్చ, ఇక ఇవాళ కొచ్చి ఈవెంట్లో మలయాళం సినిమా గొప్పదనం గురించి నాని చెప్పిన విషయాలు హైలైట్ అయ్యాయి కానీ.. సినిమా కంటెంట్ అయితే ఏమీ జనాల్లోకి వెళ్లలేదు.

ADVERTISEMENT

సంపూర్ణేష్ బాబు, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, నబాకాంత్-రియల్ సతీష్ మాస్టర్స్ మరియు సోనాలి కులకర్ణిలు ఇంటర్వ్యూలు ఇచ్చినా వాటి ఇంపాక్ట్ అనేది పెద్దగా లేదు. ఎందుకంటే వాళ్లెవరూ సినిమా గురించి చెప్పలేకపోతున్నారు. ఎంత చెప్పాలి, ఏం చెప్పాలి అనే క్లారిటీ లేకపోవడం అనేది ముఖ్య కారణం.

శ్రీకాంత్ ఓదెల లేదా నాని రంగంలోకి దిగి.. కంటెంట్ గురించి మాట్లాడితే తప్ప సినిమాకి హైప్ క్రియేట్ అవ్వడం కష్టం. మరి ఈ విషయాన్ని టీమ్ ఎప్పుడు గ్రహిస్తారు? సరిగ్గా నాలుగు రోజులు కూడా లేని సమయంలో ఎలా ప్లాన్ చేస్తారు? అనేది పెద్ద ప్రశ్న.

ADVERTISEMENT
Latest Stories