ఉపఎన్నికలు….ప్రజలు హ్యాండిస్తారా.? గులాబీ పువ్వు పెడతారా.?

Khairatabad By-Election: Congress and BRS Prepare for Battle

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రర్ పై హై కోర్ట్ వేసిన అనర్హత వేటు పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. హై కోర్ట్ ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికలకు సిద్ధం అనేలా ప్రకటనలు చేసారు.

అయితే అధికార పార్టీగా కాంగ్రెస్ లో ఈ ధీమా వింతేమీ కాకపోవచ్చు, మరి బిఆర్ఎస్ కూడా ఉపఎన్నికల యుద్దానికి సై అంటూ సవాల్ విసురుతుందా.? ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ, కానీ అభ్యర్థి ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, అయితే బిఆర్ఎస్ నుంచి ఎవరు బరిలోకి దిగినా విజయం మాత్రం తమదే అంటూ గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు మహేష్ గౌడ్.

ADVERTISEMENT

అసలు తెలంగాణ రాజకీయాలలోకి పార్టీ ఫిరాయింపుల విష సంస్కృతిని తెచ్చించి, పెంచి పోషించింది కేసీఆరే అని, గతంలో కాంగ్రెస్ మహిళా నేత అయిన సబితా ఇంద్రారెడ్డి కి బిఆర్ఎస్ కండువా కప్పి ఆమెకు మంత్రి పదవి ఇచ్చింది ఎవరు అనేది బిఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకోవాలంటూ కేటీఆర్ కి చురకలు వేశారు.

అయితే తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చేది మేమే అంటూ జబ్బలు చరచుకుంటున్న బిఆర్ఎస్ పార్టీకి ఖైరతాబాద్ ఉపఎన్నికలు అత్యంత కీలకం. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యతిరేకత పెరిగిపోయిందని, ముఖ్యంగా రైతులు, యువతలో రేవంత్ సర్కార్ పట్ల వ్యతిరేకత కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉందంటూ బిఆర్ఎస్ చేసిన, చేస్తున్న ప్రకటనలకు ఈ ఉపఎన్నికలు సాక్షాలుగా మారనున్నాయి.

హైడ్రా మొదలుకుని, రేవంత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం వరకు, రాష్ట్ర ప్రజల తాగు నీటి నుంచి రైతుల సాగు నీటి వరకు, యువతకు ఉపాధి అవకాశాల నుంచి వారి జీవన ప్రమాణాల మెరుగు వరకు, హైద్రాబాద్ లో ఐటీ అభివృద్ధి నుంచి లా అండ్ ఆర్డర్ వరకు రేవంత్ సర్కార్ అన్ని విషయాలలోనూ ఫెయిల్ అయ్యిందంటూ బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ప్రజా స్పందన ఖైరతాబాద్ ఉపఎన్నిక ఫలితాలని చెప్పవచ్చు.

అలాగే అటు కాంగ్రెస్ సైతం తమ 1000 రోజుల పాలనతో రాష్ట్రంలో అవినీతి నిర్ములన, కొత్త ప్రోజెక్టుల నిర్మాణం, ఎన్నికల హామీల అమలు, వాటి వెనుకున్న ప్రభుత్వ కష్టం, గత పాలకుల అవినీతి చిట్టా, మాజీ సీఎం అక్రమ ఆస్తుల పొద్దు, ప్రతిపక్ష నేతగా ప్రజాధనం జీతంగా తీసుకుంటూ కేసీఆర్ అసెంబ్లీ కి గైర్హాజరు అంటూ బిఆర్ఎస్ పై చేసిన ప్రతి ఆరోపణకు, తమ ప్రభుత్వం పై చెప్పుకున్న ప్రతి మెప్పుకు ప్రజల నుంచి వచ్చే రిఫరెండమ్ గా ఈ ఉపఎన్నికల ఫలితాలను బేరీజు వేయవచ్చు.

మొత్తానికి దానం పై హై కోర్ట్ వేసిన అనర్హత వేటుతో ఖైరతాబాద్ లో ఉపఎన్నికలు జరిగితే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనకు అనర్హత వేటు వేసి హ్యాండ్ ఇస్తారా.? లేదా ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ ను ఫెయిల్ చేసి చెవిలో గులాబీ పువ్వు పెడతారో అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories