అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!
మొన్న జగన్ డిమాండ్ చేయగానే, నిన్న చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1న ప్రకటన చేస్తాననడమే ఇందుకు నిదర్శనమని వైసీపీ సొంత మీడియా ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసింది.
ఒకవేళ జగన్ అడగకపోతే చంద్రబాబు నాయుడు కరువు మండలాలు ప్రకటించేవారు కాదా? రైతులకు నష్ట పరిహారం చెల్లించేవారు కారా? అంటే అవుననే అనుకోవాలేమో?
ఎల్‌నినో ప్రభావం వలన రాష్ట్రంలో వర్షాలు పడవని చంద్రబాబు నాయుడు ఫిభ్రవరిలోనే చెప్పారని మొన్న పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్సింగ్‌లో స్వయంగా చెప్పారు. అంటే ఎల్‌నినో దాని ప్రభావం గురించి జగన్‌కు తెలియక ముందే సిఎం చంద్రబాబు నాయుడు కార్యాచరణకు సిద్డంయ్యారనే కదా?
ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు రాష్ట్రంలో రైతులకు ఆర్ధిక సాయం అందించాలని కోరారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నందున అటు వెలిగొండ నుంచి సీమ జిల్లాలకు, ఇటు పోలవరం నుంచి విశాఖ జిల్లా వరకు నీళ్ళు పారించారు. ఆయా జిల్లాలలో రిజర్వాయర్లు నింపి, తాగుసగునీరు అందేలా చేశారు.
ఇది కాక కరువు పీడిత ప్రాంతాలను వాటిలో పంట నష్టాన్ని గుర్తించి అంచనా వేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. వారు ఆ నివేదికలు సిద్ధం చేస్తున్న సంగతి పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి హడావుడిగా సమావేశం నిర్వహించి ఎల్‌నినో అంటూ తనకు అలవాటు లేని వివరాలు, గణాంకాలు చదివి వినిపించారు.
కనుక కరువు మండలాల గురించి చంద్రబాబు నాయుడు చేసిన ఈ ప్రకటనను కూడా జగన్ తన పద్దులో రాసేసుకొని, జగన్ వార్నింగ్ ఇవ్వగానే చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా? అదే… జగన్ శాసనసభకు వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడుని నిలదీసి ఉంటే, తప్పకుండా నేడు ఇలా రాసుకోవచ్చు.




