భారీ అంచనాల నడుమ విడుదలైన కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ ల “దేవర” సినిమా రికార్డు ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద ఆశాజనకంగా నిలిచింది. మొదటి మూడు రోజులు కొల్లగొట్టిన కలెక్షన్స్ తో నిర్మాతలు, పంపిణీదారులు ఉత్సాహంగా ఉన్నారు.
Also Read – మద్య నిషేదమని స్టోరీ చెప్పలేదు…
తొలి రోజు భారీ ఓపెనింగ్స్ తో మొదలైన “దేవర”కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. గత రెండు, మూడేళ్లల్లో ఇలా డివైడ్ టాక్ వచ్చిన అగ్ర హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తొలిరోజే చతికిలపడిపోయిన వైనం తెలిసిందే. ఈ ఏడాది రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ సొంతం చేసుకున్న “గుంటూరు కారం” పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమి కాదు.
కానీ “దేవర” మాత్రం అందుకు విరుద్ధంగా, డివైడ్ టాక్ ను ఎదుర్కొని బాక్సాఫీస్ బరిలో నిలబడడం గమనించదగ్గ అంశం. జూనియర్ ఎన్టీఆర్ కున్న విపరీతమైన మాస్ అభిమానగణమే దీనికి ప్రధాన కారణం.
Also Read – ఆహా అనిపించిన బాలయ్య అన్ స్టాపబుల్…!
ఘనంగా ముగిసిన వీకెండ్ కలెక్షన్స్ ఉధృతి ఈ వారంలో కూడా కొనసాగుతుందా? లేదా? అని ట్రేడ్ వర్గాలు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సోమవారం నాటి ఆన్ లైన్ బుకింగ్స్ తగ్గగా, సాయంత్రం, నైట్ షోలకు గనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను రప్పించగలిగితే, అనూహ్యమైన రికార్డులకు “దేవర” స్వాగతం పలికినట్లే!
అలా కాకుండా ఈ వీక్ కలెక్షన్స్ భారీగా తగ్గితే, బాక్సాఫీస్ వద్ద కేవలం ‘యావరేజ్’ ఫిగర్స్ ని మాత్రమే “దేవర” అందుకోగలుగుతుంది. బరిలో ఏ పెద్ద సినిమా పోటీ లేకపోవడం మరియు అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతి మొదలుకుని 14వ తేదీ వరకు దసరా పర్వదిన సెలవులు “దేవర”కు అత్యంత అనుకూలమైన అంశాలు.
Also Read – గేమ్ ఛేంజర్… నిజమే!
“దేవర – పార్ట్ 1” కధలో చూపించిన లోపాలు దర్శకుడిగా కొరటాల శివకు అనేక ప్రశ్నలను సంధించాయి. బహుశా పార్ట్ 2 లో వాటికి సరైన సమాధానం చెప్పగలిగితేనే ఒక దర్శకుడిగా కొరటాలకు దక్కిన అసలు విజయంగా పరిగణించాలి. “దేవర” ముగిసిన తర్వాత అసలు ఈ సినిమాకు రెండు పార్టులు ఎందుకు? అనే ప్రేక్షకుల సింగిల్ టాక్ కు కొరటాల ప్రతిభే సమాధానం చెప్పాలి.