తెలంగాణ మీద ఈగ వాలినా సహించరు కానీ జగన్‌?

YS Jagan Mohan Reddy amid Amaravati capital controversy and Andhra Pradesh political debate

గురువారం లోక్‌సభలో బిజేపి ఎంపీ తేజస్వీ సూర్య డీలిమిటేషన్‌పై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదని, నాడు బ్రిటిష్ వారు భారత్‌-పాక్‌ని విడదీసినట్లు యూపీయే ప్రభుత్వం రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీసిందన్నారు. దాని వలన నేటికీ ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాలు అనేక సమస్యలు, వివాదాలు ఎదుర్కొంటున్నాయి అన్నారు.

అంతే! తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీతో సహా బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కల్వకుంట్ల కవిత తదితరులు ఎంపీ తేజస్వీ సూర్యపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

ADVERTISEMENT

రాష్ట్ర విభజనని దేశ విభజనతో పోల్చి నందుకు అయనపై దేశ ద్రోహం నేరం మోపాలని కొందరు, ఆయనని ఆ పదవిలో నుంచి బర్త్ రఫ్ చేయాలని కొందరు, ఆయనపై అనర్హత వేటు వేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలని మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఒక్క మాట అంటేనే తెలంగాణలో పార్టీలకు అతీతంగా అందరూ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు.

కానీ జగన్‌ ప్రభుత్వం అమరావతిని పక్కన పడేసి మూడు రాజధానులన్నప్పుడు, విశాఖ రాజధాని అన్నప్పుడు, రాష్ట్రం నుంచి పరిశ్రమలను వెళ్ళగొడుతున్నప్పుడు, నేటికీ అమరావతి వద్దని మావిగన్‌ అంటున్నప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్‌కు వంతపాడుతున్నారే తప్ప ఏ ఒక్కరూ ఇది తప్పని, ఇలాంటి ఆలోచనల వలన రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతుందని వారించడం లేదు. పైగా మావిగన్‌ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి మరీ మద్దతు ఇస్తున్నారు. మావిగన్‌ కాదంటే రప్పా రప్పా తప్పదని హెచ్చరిస్తున్నారు కూడా!

తెలంగాణలో పార్టీలన్నీ ‘జై తెలంగాణ’ అంటుంటే, ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కనీసం ‘అమరావతి’ అని పేరు పలకడానికి కూడా ఇష్టపడటం లేదని సిఎం చంద్రబాబు నాయుడు ఊరికే అనలేదు.

ADVERTISEMENT
Latest Stories