
నేడు దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఈ ఏడున్నర దశాబ్ధాలలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని కానీ ఇది సరిపోదని 2047నాటికి అన్ని రంగాలలో భారత్ అభివృద్ధి సాధించి ‘వికసిత్ భారత్’గా నిలవాలని ఆకాంక్షించారు.
Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?
ప్రధాని ప్రసంగంలో రెండు ముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. ఒకటి అంతరిక్షంలో భారత్‌కి సొంత పరిశోధనా కేంద్రం (స్పేస్ స్టేషన్) ఏర్పాటు చేసుకోవడం. రెండోది దేశంలో విద్యార్దులు వైద్య విద్యా అభ్యసించడానికి విదేశాలకు వెళుతున్నారని ఆ దుస్థితి తొలగించడానికి దేశంలోనే భారీగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
మాజీ సిఎం జగన్ “ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.” అని ట్వీట్ చేశారు.
ఐదేళ్ళ జగన్ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విముక్తి పొందినందున రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా జగన్, వైసీపి బాధితులు మళ్ళీ స్వాతంత్ర్యం లభించింది. తెలంగాణలో పదేళ్ళ కేసీఆర్ నియంతృత్వ పాలన ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?
ఇది ప్రజలు పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యమే. కనుక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నేడు స్వేచ్ఛగా, సంతోషంగా మరోసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.