తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టులో నిన్న జరిగిన వాదనలు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను ‘సిఎం చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టులో చెంపదెబ్బ’ అంటూ వైసీపి సొంత మీడియా, సోషల్ మీడియాలో తీర్మానించేశారు.
Also Read – మత్తు వదలదా వైసీపి?
అయితే సిఎం చంద్రబాబు నాయుడు నిజంగానే ఈ అంశంతో రాజకీయాలు చేశారా?చేతిలో ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేకుండానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేశారా? అలా మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడిన్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తప్పు చేశారా? అనే సందేహాలు కలుగుతాయి.
ముందుగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టులో ఈ వాదనలు, న్యాయమూర్తుల అభిప్రాయాలు అన్నీ విన్నప్పుడు, ఈ నెయ్యి కల్తీ వ్యవహారం అంతా జూన్, జూలై నెలల్లోనే మొదలైన్నట్లు, అప్పటి నుంచే జరిగిన్నట్లు, అంతకు ముందెన్నడూ జరుగన్నట్లు అనిపిస్తుంది.
Also Read – మద్య నిషేదమని స్టోరీ చెప్పలేదు…
అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైసీపి నేతలు టీటీడీని కబ్జా చేసినప్పటి నుంచే తిరుమలలో అనేక అపచారాలు చాలా జరుగుతూనే ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిలో ఈ నెయ్యి కల్తీ కూడా ఒకటి కావచ్చు. అందుకే గత 5 ఏళ్ళుగా లడ్డూ నాణ్యత, రుచిలో చాలా తేడా కనిపిస్తూనే ఉందని భక్తులు పిర్యాదులు చేస్తూనే ఉన్నారు కదా?
కనుక జగన్ ప్రభుత్వానికి, వైసీపి నేతలతో నిండిన టీటీడీ పాలక మండలికి నిజంగా భక్తి, చిత్తశుద్ధి ఉండి ఉంటే అప్పుడే కల్తీ నెయ్యిని జాతీయ స్థాయి ల్యాబ్‌కి పంపించి పరీక్షలు చేయవచ్చు. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ కంపెనీ తక్కువ ధరకు నెయ్యి ఇస్తే దానిని తీసుకున్నారు తప్ప నాణ్యమైన నెయ్యి అంత తక్కువ ధరకు ఎలా లభిస్తుందని ఆలోచించలేదు.
Also Read – ఆహా అనిపించిన బాలయ్య అన్ స్టాపబుల్…!
కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమల ప్రక్షాళన మొదలుపెడితే ఈ వ్యవహారం బయటపడింది.
వెంటనే కల్తీ నెయ్యిని ల్యాబ్‌కి పంపించి నివేదిక తెప్పించుకుని నిర్ధారించుకున్నారు. తర్వాత ఆ నెయ్యి సరఫరా చేసిన సంస్థకి నోటీస్ పంపించి సంజాయిషీ తీసుకున్నారు. అంటే ల్యాబ్ రిపోర్ట్, కంపెనీ సంజాయిషీ రెండు చేతికి వచ్చిన తర్వాతే అంటే సెప్టెంబర్ 18న మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
అదీ ఎందువల్ల అంటే… ఆ కంపెనీకి నోటీస్ ఇచ్చిన విషయం మీడియా ద్వారా బయటకు వచ్చేసినందునే. అప్పటికీ ప్రభుత్వం గోప్యత పాటిస్తే ప్రజలకు ప్రభుత్వంపైనే అనుమానాలు, అపోహలు మొదలవుతాయని అందువల్లే సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సి వచ్చింది తప్ప ఈ పేరుతో రాజకీయాలు చేయడానికో లేదా భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకో కాదని టీటీడీ న్యాయవాది సిద్ధార్థ్ లూద్ర వాదనలు నూటికి నూరు శాతం నిజమే అని అర్దమవుతోంది.
కనుక ఈ విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా పద్దతిగా వ్యవహరించారు తప్ప అధికారం చేతిలో ఉన్నా ఏమాత్రం తొందరపడలేదని స్పష్టం అవుతోంది.
ఇక ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తే దీనికి బాధ్యులైన వైసీపి నేతలందరూ ఊచలు లెక్కించాల్సి వస్తుంది కనుక సీబీఐ లేదా సుప్రీంకోర్టు విచారణ జరపాలని కోరుతున్నారు. స్వామివారి ప్రసాదాన్నే కల్తీ చేసినందుకు వారు ఇంకా పెద్ద శిక్షకు అర్హులు. కనుక వారి ముచ్చట ఎందుకు కాదనాలి?