కేసీఆర్ కు సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ!

tollywood celebrities congratulate kcrగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పలువురు ప్రముఖులు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఫలితాలు వెల్లడి కాగానే కేసీఆర్ కు ఫోన్ చేసి రికార్డు విజయం సొంతం చేసుకున్నారని ప్రత్యేకంగా కేసీఆర్ ను అభినందించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు, తెలుగుదేశం నేత, హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ కూడా కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ, మంచు మోహన్ బాబు కూడా కేసీఆర్ కు అభినందనలు తెలిపిన వారి జాబితాలో ఉన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories