‘టాక్సిక్’ అర్థం కాలేదా?… గీతూ పేరుతో వైరల్ అవుతున్న షాకింగ్ స్టేట్‌మెంట్!

Geetu Mohandas and Toxic movie amid fake viral statement controversy

భారీ బడ్జెట్‌తో, ఎన్నో ఏళ్ల పాటు తెరకెక్కిన ‘టాక్సిక్’ చివరకు డిజాస్టర్‌గా మిగిలిపోయింది. మొదటి షో పూర్తయిన వెంటనే సినిమా మీద ఉన్న హైప్ మొత్తం మాయమైంది.

ఇప్పుడు సినిమాతో పాటు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పేరుతో ఓ స్టేట్‌మెంట్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ADVERTISEMENT

“90% of boys are single that’s why they didn’t understand the relationship of raya with multiple baddies and the complex nature of film #Toxic.” – Geetu Mohandas.

ఈ స్టేట్‌మెంట్ చూసిన చాలామంది నిజంగానే గీతూ మోహన్‌దాస్ ఇలా అన్నారా అని ఆశ్చర్యపోతున్నారు.

కానీ ఆమె ఇలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇది ఎవరో కావాలనే క్రియేట్ చేసిన ఫేక్ స్టేట్‌మెంట్.

అయితే దీన్ని తయారు చేసిన విధానం మాత్రం చాలా తెలివిగా ఉంది.

గతంలో ‘ఫైటర్’ సినిమా విషయంలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యను పోలి ఉండేలా దీనిని క్రియేట్ చేశారు.

చాలామంది విమాన ప్రయాణం చేయలేదు కాబట్టి ‘ఫైటర్’ సినిమాతో కనెక్ట్ కాలేకపోయారని అప్పట్లో సిద్ధార్థ్ ఆనంద్ చేసిన వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారితీసింది. అది ఆయన నిజంగా చేసిన వ్యాఖ్య. ఇప్పుడు అదే తరహాలో ‘టాక్సిక్’లోని రిలేషన్‌షిప్స్‌ను అర్థం చేసుకోలేకపోవడానికి అబ్బాయిలు సింగిల్‌గా ఉండటమే కారణమన్నట్టు గీతూ మోహన్‌దాస్ పేరుతో ఈ ఫేక్ స్టేట్‌మెంట్ తయారు చేశారు.

సోషల్ మీడియాలో సరదా కోసం ఇలాంటి ఫేక్ స్టేట్‌మెంట్స్ క్రియేట్ చేసేవాళ్లు ఉంటారు.

దానికి సరైన టైమింగ్ కూడా తోడైతే అసలు విషయం తెలుసుకునేలోపే వైరల్ అయిపోతుంది.

‘టాక్సిక్’ డిజాస్టర్ కావడంతో సినిమాను ట్రోల్ చేయాలనుకునేవాళ్లకు ఈ స్టేట్‌మెంట్ మరింత ఉపయోగపడింది. దీంతో నిజానిజాలు చూడకుండానే చాలామంది దాన్ని షేర్ చేస్తున్నారు.

మొత్తానికి వైరల్ అవుతున్న మాటలు గీతూ మోహన్‌దాస్ చెప్పినవి కావు.

‘టాక్సిక్’ను ట్రోల్ చేసేందుకు ఎవరో తెలివిగా క్రియేట్ చేసిన ఫేక్ స్టేట్‌మెంట్ మాత్రమే!

ADVERTISEMENT
Latest Stories