తెలుగు హీరోకు పోలీసులు 100 రూపాయలు ఫైన్!

100 rupees fine to sampoorneshటాలీవుడ్ ‘బర్నింగ్ స్టార్’ హీరో సంపూ పోలీసులకు దొరికిపోయాడు. కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణించడంతో సంపూర్నేష్ బాబును చెక్ చేసిన ట్రాఫిక్ పోలీసులు వంద రూపాయల జరిమానా విధించారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో సీటు బెల్టు కట్టుకోకుండా కారు నడిపాడు మన సంపూ. ఇతనితో బాటు మరో 100 మందికి ట్రాఫిక్ పోలీసులు 100 రూపాయల ఫైన్ వేశారు.

ADVERTISEMENT

తన ‘కొబ్బరి మట్టం’ సినిమా షూటింగ్‌లో సంపూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాను ట్రాఫిక్ నియమాలు పాటిస్తానని, అయితే ఈ మూవీ గురించి ఆలోచిస్తూ కారులో సీటు బెల్టు ధరించడం మరిచిపోయానని సంపూ తెలిపాడు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సిద్దిపేటలో వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పుడు జరిగింది ఈ ఘటన.

ADVERTISEMENT
Latest Stories