మరీ ఇంత దారుణమా? మోడీ సర్కారుకు మనసు లేదా?

train tickets cost doubled for migrantsవారంతా కరోనా వల్ల అష్టకష్టాలు పడ్డారు. నిలువ నీడ లేక… తినడానికి తిండి లేక అలమటించాడు. పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రాలకు వచ్చి కనిపించని శత్రువుతో యుద్ధంలో అలమటించారు. కొందరు కాలి నడకనే వేల కిలోమీటర్లు నడిచి సొంత ఊర్లకు వెళ్లే ప్రయత్నం చెయ్యగా… కొందరు ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిందని సంబరపడ్డారు.

అయితే ఆ రైళ్లను కూడా ఉచితంగా అందించే మనసు లేకుండా పోయింది కేంద్ర ప్రభుత్వానికి. మాములు రోజులలో అయ్యే ఖర్చు కంటే మూడు రేట్లు ఎక్కువకు టిక్కెట్లు అమ్ముతుంది రైల్వే. వారి నుండే రిటర్న్ జర్నీ ఛార్జ్ కూడా వసూలు చేస్తుందంటే పరిస్థితి ఎంత దారుణం అనేది అర్ధం అవుతుంది.

ADVERTISEMENT

అంత డబ్బే ఉంటే మాకు ఈ తిప్పలు ఎందుకు అని వారు వాపోతున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఖర్చుని తామే భరిస్తున్నాయి. అయితే వలసకార్మికుల నుండి వసూలు చేసినా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి వసూలు చేసినా అది అమానుషమే అని చెప్పుకోవాలి. తమ పౌరుల మీద కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా?

దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య వలస కార్మికులను తరలించడానికి 40 దాక రైళ్లు నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఒక్క తెలంగాణలోనే దాదాపుగా 15 లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్టు సమాచారం. ఆ రైళ్లు గమ్యస్థానాలకు చేరాకా వారిని బస్సులలో వారి జిల్లాలకు తరలిస్తారు. 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచిన తరువాతే వారి ఇళ్ళకు పంపిస్తారు.

ADVERTISEMENT
Latest Stories